ఆటలో గెలిచినా... భర్త వేధింపులు తప్పలేదు!
ఆడవాళ్లు రాకెట్లలో ఆకాశంలోకి దూసుకెళ్తున్నారు...దేశ సరిహద్దులు దాటి క్రీడల్లో ఎన్నో పతకాలు సాధిస్తున్నారు. ఇలా ఎన్నో అడ్డంకులను అధిగమించి అన్నింటా ఘన విజయాలు సాధిస్తున్న మహిళలు గృహ హింసపై మాత్రం గెలవలేకపోతున్నారు. అనాదిగా వస్తున్న అదనపు కట్న వేధింపులు, అత్తింటి ఆరళ్లు వారిని ఇంకా వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది భర్త పెట్టే శారీరక, మానసిక హింసను భరిస్తూ కళ్లు మూసుకుని కాపురం చేస్తున్నారు. మరికొద్ది మంది భర్త పెట్టే బాధను భరించలేక తమ ఆవేదనను బయటకు వెళ్లగక్కుతున్నారు. ఇందులో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ సూరజ్ లతా దేవి తన భర్త పెట్టే వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది.
Know More