సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

సుమక్కా! నువ్వు సూపర్‌!

సుమ కనకాల... మాటలతో మాయ చేసే ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలుపెరగని మాటల ప్రవాహానికి కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే ఆమె ఎక్కడుంటే అక్కడ ఫుల్‌ హంగామా ఉంటుంది. అందుకే బుల్లితెరపై ఏ ప్రోగ్రాం చూసినా సుమ సందడే కనిపిస్తుంటుంది. ఇక వెండితెరకు సంబంధించి ఏ ఆడియో ఫంక్షన్‌, ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ జరిగినా ఈ క్రేజీ యాంకర్‌ హంగామానే వినిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆమె లాక్‌డౌన్‌లోనూ వివిధ రకాల పోస్టులు, వీడియోలతో తన అభిమానులను అలరిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఓ అద్భుతమైన డ్యాన్స్‌తో మన ముందుకొచ్చిందీ బుల్లితెర ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara

ఇంట్లోనే ఉంటూ మనసు మాట వింటున్నారు..!

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎంతో కఠినంగా పాటిస్తున్నారంతా. అయితే అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్‌ని సద్వినియోగం చేసుకునేందుకు అందరూ రకరకాల మార్గాలను ఎంచుకొంటున్నారు. వీరిలో తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తోన్న వారు కొందరైతే.. ఇంట్లో ఉంటూనే తమ వృత్తిగత బాధ్యతలను నిర్వర్తిస్తోన్న వారు మరికొందరు. ఈ నేపథ్యంలో టీవీ షోస్‌ షూటింగ్‌లతో నిత్యం బిజీగా ఉండే మన తెలుగు టీవీ యాంకర్లకు కూడా లాక్‌డౌన్‌తో కాస్త బ్రేక్‌ దొరికినట్లయ్యింది. దాంతో అటు తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూనే.. ఇటు తమ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. మరి, ఈ క్వారంటైన్‌ సమయాన్ని వాళ్లు ఎలా గడుపుతున్నారో మీరే చూడండి.

Know More

women icon @teamvasundhara

సెలబ్రిటీల ‘కరోనా’ పాఠాలు!

స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి.. కొన్ని ప్రదేశాల్లో అయితే ఏకంగా 144 సెక్షన్‌ విధించారు. ఇదంతా ‘కరోనా’ (కొవిడ్‌-19) సృష్టిస్తోన్న కల్లోలంలో భాగమే. బహుశా మానవజాతి చరిత్రలో ఒక వైరస్‌ ఇలా ప్రపంచాన్ని భయపెడుతుండడం ఇదే తొలిసారి కావొచ్చు. ఈ వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రపంచమంతా ఒక్క తాటిపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కరోనాను ఎలా అడ్డుకోవాలి? ఈ వైరస్‌ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలపై ప్రభుత్వాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. సినిమాల్లో తారలు చెప్పే డైలాగ్‌లకు చప్పట్లు కొడుతూ.. ఈలలు వేసే మనం.. వారు చెబుతోన్న ఈ సూచనలు కూడా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది కదూ! ఇంతకీ కరోనాపై అవగాహన కల్పిస్తోన్న ఆ సెలబ్రిటీలు ఎవరు..? వారేం చెబుతున్నారో చూద్దామా?

Know More

women icon @teamvasundhara

అప్పుడు ‘యాంకరింగ్‌’ అనేదే లేదు!

‘మైక్‌కి మాటలు వస్తే ‘సుమ’ లాగా మాట్లాడుతుందేమో... అందుకే గంటల కొద్దీ మాటల గారడీ చేసే ఆమె ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. తన వాగ్ధాటికి సమయస్ఫూర్తి, హాస్యం, చలాకీ తనాన్ని జోడిస్తూ ఆమె విసిరే పంచ్‌లు ఎవ్వరినైనా నవ్వుల్లో ముంచెత్తుతాయి. బుల్లితెరపై ఏ ప్రోగ్రాం చూసినా సుమ సందడే కనిపిస్తుంది...వెండితెరకు సంబంధించి ఏ ఆడియో రిలీజ్‌, ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగినా ఈ స్టార్‌ యాంకర్‌ హడావిడే వినిపిస్తుంది. మరి అలుపెరగకుండా మాట్లాడే ఈ బుల్లితెర మహారాణి మాటల ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? అసలు ఈ రంగంలోకి ఆమె ఎలా వచ్చింది? యాంకరింగ్‌కు సంబంధించి ఆమె అనుభవాలేంటి? తదితర విషయాలు తెలుసుకోవాలంటే స్వయంగా తనే పంచుకున్న ముచ్చట్లు వినాల్సిందే..!

Know More

women icon @teamvasundhara

మా మార్నింగ్‌లు ఇలాగే ఉంటాయి!

సుమ కనకాల... తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అలుపెరగని మాటల ప్రవాహానికి కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే ఆమె ఎక్కడుంటే అక్కడ మాటల పరవళ్లే. సమయస్ఫూర్తికి హాస్యాన్ని జోడిస్తూ తను విసిరే పంచ్‌లు, ఛలోక్తులు ఎవ్వరినైనా నవ్వుల్లో ముంచెత్తుతాయంటే అతిశయోక్తి కాదు. అందుకే బుల్లితెరపై ఏ ప్రోగ్రాం చూసినా సుమ సందడే కనిపిస్తుంది. సినిమాలకు సంబంధించి ఏ ఆడియో ఫంక్షన్‌, ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ జరిగినా ఈ స్టార్‌ యాంకర్‌ హంగామానే వినిపిస్తుంది. ఇలా నిత్యం వివిధ షోలు, ప్రోగ్రాంలు, ఈవెంట్లు, షూటింగ్‌లతో బిజీగా ఉండే సుమ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ ముద్దుగుమ్మ షేర్‌ చేసిన ఓ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala