అందుకే 90 ఏళ్ల వయసులో అంత ఎత్తు నుంచి దూకేసింది!
స్కై డైవింగ్.. ఈ మాట వినగానే చాలామందికి గుండె జారి గల్లంతవుతుంది.. ఇక ఈ సాహస క్రీడలో పాల్గొనే వారిని చూస్తే ఒంటి మీద రోమాలు నిక్కబొడవడం ఖాయం. అలాంటిది ఇంతటి సాహస కృత్యం చేసే ధైర్యం మీకుందా? అని అడిగితే.. అమ్మ బాబోయ్ మా వల్ల కాదనే అంటారు చాలామంది. కానీ అంతకుమించిన ధైర్యం తనకుందని నిరూపించింది ఇంగ్లండ్‌కు చెందిన ఓ బామ్మ. అదీ 90 ఏళ్ల వయసులో! ఇటీవలే తన పుట్టిన రోజును జరుపుకొన్న ఈ గ్రానీ.. ఏటా కంటే ఈసారి ప్రత్యేకంగా, సాహసోపేతంగా బర్త్‌డే చేసుకోవాలనుకుంది. అందుకే ఇంతటి సాహసానికి పూనుకుంది. కేవలం ఇదొక్కటే కాదు.. తాను స్కై డైవింగ్ చేయడం వెనుక మరో బలమైన కారణం కూడా ఉందంటోంది.. మరి, ఇంతకీ ఎవరా బామ్మ? ఇంత లేటు వయసులో అంత యాక్టివ్‌గా స్కై డైవింగ్ ఎలా చేసింది? ఎందుకు చేసింది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
Know More