సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

అదో భయంకరమైన అనుభవం.. కరోనాను జోక్‌గా తీసుకోవద్దు!

కరోనా కారణంగా ఒంటరితనం అంటే ఎలా ఉంటుందో చాలామందికి తెలిసొచ్చింది. వైరస్‌ సోకి స్వీయ నిర్బంధంలో ఉంటూ కొందరు; ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో చికిత్స పొందుతూ మరికొందరు... ఇలా ఎక్కడి వారక్కడే ఏకాకిగా మిగిలిపోతున్నారు. ఫలితంగా ఒంటరితనంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్ని తానూ ఎదుర్కొన్నానంటోంది హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా. పదేళ్ల క్రితం పాక్‌ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన ఈ టెన్నిస్‌ క్వీన్‌ రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చింది. అమ్మయ్యాక అటు కుటుంబ బాధ్యతల్ని నెరవేరుస్తూనే... ఇటు తన కెరీర్‌నూ కొనసాగిస్తోందీ సూపర్‌ మామ్‌. ఈక్రమంలో తన కుమారుడి ఆలనాపాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోన్న సానియా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిందట. ఈ కారణంగా కొద్ది రోజుల పాటు తన కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరితో షేర్‌ చేసుకుందీ టెన్నిస్‌ బ్యూటీ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

Know More

women icon @teamvasundhara

ఇజాన్ పుట్టాకే అవన్నీ నాకు అర్థమయ్యాయి!

అమ్మతనం.. ఈ లోకంలో అన్నింటికంటే అమూల్యమైనది. స్వయంగా అనుభవిస్తే తప్ప అందులో ఉన్న కమ్మదనాన్ని మనం ఆస్వాదించలేం. అంతేకాదు.. బాధ్యత, ఓపిక, మనల్ని మనం ప్రేమించుకోవడం, నిస్వార్థమైన ప్రేమను పంచడం.. ఇలా ఎన్నో విషయాలు నేర్పుతుందీ అద్భుతమైన భావన. ఇలాగే అమ్మతనం తననీ ఓ మంచి మనిషిని చేసిందంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా. రెండేళ్ల క్రితం ఇజాన్‌కు జన్మనిచ్చిన ఈ సూపర్‌ మామ్‌.. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఫిట్‌గా మారి ఈ ఏడాది కోర్టులోకి అడుగుపెట్టింది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తల్లయ్యాకా మహిళలు తమ కెరీర్‌లో దూసుకుపోగల సమర్థులు అని నిరూపించింది. ఇలా తన పోస్ట్‌ ప్రెగ్నెన్సీ జర్నీకి అమెరికన్‌ టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ స్ఫూర్తి అంటూ తాజాగా ఓ సుదీర్ఘ లేఖ రాసింది సానియా. అమ్మతనం తనకు అందించిన అనుభవాలు, ప్రసవానంతరం బరువు తగ్గడం, సెరెనా తనలో ప్రేరణ నింపిన విధానం, వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌.. ఇలా ఎన్నెన్నో విషయాలు రంగరించి రాసిన ఆ లేఖ సోషల్‌ మీడియాలో వైరలవడమే కాదు.. ఎంతోమంది తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది.

Know More

women icon @teamvasundhara

హ్యాపీ బర్త్‌డే మిర్చి మమ్మీ!

సానియా మీర్జా... క్రికెట్‌ను మాత్రమే ఆరాధించే మన దేశంలో టెన్నిస్‌కు విశేష గుర్తింపు తీసుకొచ్చిన క్రీడాకారిణి. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో పాటు డబుల్స్ విభాగంలో వరల్డ్‌ నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఈ టెన్నిస్‌ క్వీన్‌ తన ఆటతీరుతో టెన్నిస్‌ కోర్టుకే అందం తెచ్చింది. మెటర్నిటీ బ్రేక్‌ కారణంగా రెండేళ్లు దూరమైనా మళ్లీ టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టి అదరగొడుతోన్న ఈ టెన్నిస్‌ సెన్సేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అశేష అభిమానులున్నారు. ఈ క్రమంలో తాజాగా (నవంబర్ 15) 34వ వసంతంలోకి అడుగుపెట్టిందీ హైదరాబాదీ సంచలనం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమదైన శైలిలో సానియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Know More

women icon @teamvasundhara

ధోనీ... నువ్వొక నిజమైన జెంటిల్మన్!

పదహారేళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాల మీద మోసిన మహేంద్ర సింగ్‌ ధోనీ మాయాజాలం ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించదు. ఆటగాడిగానే కాదు అంతకంటే అత్యద్భుత నాయకుడిగా జట్టకు ఎన్నో మధురమైన విజయాలు అందించిన ఈ కూల్‌ కెప్టెన్‌ ఎలాంటి హంగు, అర్భాటం లేకుండానే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పాడు. భారత క్రికెట్‌ జట్టు రూపురేఖలను సమూలంగా మార్చేసిన ఈ మహేంద్రుడు స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. అతడి నిర్ణయంతో క్రికెట్‌ అభిమానులు పూర్తిగా నిరాశలో మునిగిపోగా, ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు అతని సేవలను కొనియాడుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు. ఈ సందర్భంగా ధోనీ సతీమణి సాక్షి సింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ భావోద్వేగ పోస్టును షేర్‌ చేసింది.

Know More

women icon @teamvasundhara

నేను బరువు తగ్గడానికి అదే బలమైన కారణం!

మాతృత్వం కారణంగా సుమారు రెండేళ్ల పాటు టెన్నిస్‌కు దూరమైంది సానియా మీర్జా. అయితే తల్లయినా ఆటమీద తనివి తీరలేదంటూ గతేడాది మళ్లీ టెన్నిస్‌ కోర్టులోకి అడుగుపెట్టింది. ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే విజేతగా నిలిచి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆరంభించింది. అయితే ఈ ఘనమైన పునరాగమనం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగుంది. చాలామంది మహిళల్లాగే తల్లయ్యాక బరువు పెరిగిన సానియా...ఆటమీద మమకారంతో మళ్లీ మెరుగైన ఫిట్‌నెస్‌ను సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. కుమారుడి ఆలనాపాలన చూసుకుంటూనే, బరువు తగ్గేందుకు జిమ్‌లో వర్కవుట్లు, వ్యాయామాలు చేసింది. కేవలం 4 నెలల్లోనే 26 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సానియా... తన బరువు, ఫిట్‌నెస్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్‌ చేసుకుంది.

Know More

women icon @teamvasundhara

మా జీవితంలోకి బుల్లి బుజ్జాయి వచ్చేశాడు!

తల్లిదండ్రులవడం అనేది జీవితంలో ఒక మెట్టు పైకెక్కడం లాంటిది. అందుకే అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందిన దంపతులందరూ ఎనలేని ఆనందోత్సాహాలకు లోనవుతుంటారు. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు హార్దిక్‌ పాండ్యా-నటాషా స్టాంకోవిచ్. మెటర్నిటీ ఫొటోషూట్ లో భాగంగా ఇటీవలే ఎంతో సంతోషంగా ఫొటోలు తీయించుకున్న ఈ సెలబ్రిటీ కపుల్‌ ఇంట్లోకి ఓ పండంటి బాబు అడుగుపెట్టాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు హార్దిక్‌. చిన్నారి చేతిని పట్టుకుని ఉన్న ఫొటోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ ‘మేం తల్లిదండ్రులయ్యాం. మాకు బాబు పుట్టాడు’ అని చెప్పుకొచ్చాడు.

Know More

women icon @teamvasundhara

సానియా అరుదైన ఘనత!

సాధారణంగా వివిధ రంగాల్లో రాణిస్తోన్న మహిళలు వివాహం తర్వాత లేదా తల్లయ్యాక తమ వృత్తిగత జీవితానికి వీడ్కోలు చెబుతుంటారు. కానీ, కొంతమంది మహిళలు మాత్రమే ఓ పక్క భార్యగా, తల్లిగా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూనే.. మరోపక్క తమ వృత్తిగత జీవితానికి సైతం న్యాయం చేస్తుంటారు. ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా ఈ కోవకే చెందుతుంది. మెటర్నిటీ బ్రేక్‌ తర్వాత తిరిగి తన కెరీర్‌ను పునః ప్రారంభించిన ఈ స్టార్‌ మామ్‌.. మాతృత్వం మహిళల ఆశయ సాధనకు ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తోంది. ఈ క్రమంలో ఫెడ్ కప్ సంస్థ (ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ - ITFకు అనుబంధ సంస్థ) ఇటీవలే సానియాను ‘ఫడ్‌ కప్ హార్ట్ అవార్డు’కు ఎంపిక చేసింది. ఈ ఘనత అందుకొన్న తొలి భారతీయురాలిగా సానియా చరిత్రకెక్కడం విశేషం.

Know More

women icon @teamvasundhara

‘భార్యా విధేయుడు’ అని అందుకే అన్నా..!

2015 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌! సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆస్ర్టేలియా, భారత్‌ జట్ల మధ్య సెమీస్‌ మ్యాచ్‌ జరుగుతోంది.. భారత క్రికెట్‌ అభిమానుల ఆశలన్నీ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ పైనే ఉన్నాయి! అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేరుకున్నాడు విరాట్‌! ఆ మ్యాచ్‌లో భారత జట్టు 95 పరుగుల తేడాతో ఓటమి పాలైంది..! భారత ఆటగాళ్ల సమష్టి వైఫల్యమే ఈ పరాజయానికి కారణమని క్రీడా పండితులు కూడా విశ్లేషించారు. కానీ అనుష్క కారణంగానే కోహ్లీ త్వరగా ఔటయ్యాడని, అందుకే భారత జట్టు పరాజయం మూటగట్టుకుందని చాలామంది ఆమెను ఆడిపోసుకున్నారు. ఈ సందర్భంలోనే కాదు.. కోహ్లీ క్రికెట్‌లో ఫెయిలయినప్పుడల్లా చాలామంది అనుష్కనే బాధ్యురాలిని చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈక్రమంలో భర్త వైఫల్యానికి భార్యను ఎలా బాధ్యురాలిని చేస్తారు అని ప్రశ్నిస్తోంది టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా.

Know More

women icon @teamvasundhara

నా జీవితమంతా ఈ ఫొటోలోనే దాగుంది!

‘మాతృత్వం మహిళల ఆశయ సాధనకు ఏమాత్రం అడ్డు కాదు.. మెటర్నిటీ బ్రేక్‌ ప్రతి మహిళా తన కెరీర్‌లో మరింత పుంజుకోవడానికి అందివచ్చిన అవకాశంగా భావించాలి..’ అంటూ ఎందరో సెలబ్రిటీలు తమ సక్సెస్‌తో చాటిచెప్పారు. వీరి బాటలోనే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఓవైపు అమ్మగా తన బుజ్జాయిని లాలిస్తూనే.. మరోవైపు టెన్నిస్‌ కోర్టులోకి అడుగుపెట్టి విజయాలతో తన రెండో ఇన్నింగ్స్‌ని ఘనంగా ఆరంభించిందీ అందాల అమ్మ. ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా తన బుజ్జాయితో గడిపిన మధురమైన క్షణాలను పంచుకుంటోన్న ఈ టెన్నిస్‌ బ్యూటీ.. తాజాగా తన కొడుకు ఇజాన్‌తో దిగిన ఓ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. దానికి చక్కటి క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో, క్యాప్షన్‌ నెట్టింట్లో వైరలయ్యాయి.

Know More

women icon @teamvasundhara

నేను ఎంత మంచిదాన్నో మీరే చెప్పండి..!

‘ఆర్‌ఎక్స్‌100’ సినిమాలో విలక్షణ నటన, అందంతో యువ హృదయాలను కొల్లగొట్టింది నటి పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన ఈ చిన్నది ‘వెంకీమామ’ చిత్రంతో మరో మెట్టెక్కింది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది పాయల్‌. తన వ్యక్తిగత విషయాలతోపాటు లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇక తాజాగా షార్ట్‌ హెయిర్‌లో సరికొత్త లుక్‌లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన పాయల్‌.. ‘మళ్లీ స్కూల్‌ రోజుల్లోకి తిరిగి వెళ్లినట్లుంది... ఈ లుక్‌లో నేను బాగున్నానా? బాలేనా?’ అంటూ రాసుకొచ్చింది.

Know More

women icon @teamvasundhara

89 వర్సెస్‌ 63: ఇది మీకూ సాధ్యమే!

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెన్నిస్‌ కోర్టులోకి రీఎంట్రీ ఇచ్చింది సానియా మీర్జా. ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే విజేతగా నిలిచి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిందీ టెన్నిస్‌ సెన్సేషన్‌. అయితే ఈ ఘనమైన పునరాగమనం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగుంది. చాలామంది మహిళల్లాగే అమ్మయ్యాక బరువు పెరిగిన సానియా...ఆటమీద మమకారంతో మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. ఓ వైపు కుమారుడి ఆలనాపాలన చూస్తూనే, మరోవైపు బరువు తగ్గేందుకు కసరత్తులు చేసింది. జిమ్‌లో వర్కవుట్లు, వ్యాయామాలు చేస్తూ డెడ్‌లైన్‌ పెట్టుకుని మరీ 89 కిలోల నుంచి 63 కిలోల బరువుకు చేరుకుంది. ఈ క్రమంలో ఈ టెన్నిస్‌ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

Know More

women icon @teamvasundhara

సముద్రం లాంటి నా కళ్లలో.. నా కలలు ప్రతిబింబిస్తాయి!

సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉండే సినీ సెలబ్రిటీల్లో మహేష్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ కూడా ఒకరు. తన చిన్నారులు, మహేష్‌ సినిమా అప్‌డేట్లకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటుందీ ఘట్టమనేని వారి కోడలు. ఈ క్రమంలో మహేష్‌, కూతురు సితార కలిసి ఉన్న ఓ ఫొటోను తాజాగా నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. సితార తండ్రి భుజంపై తల వాల్చగా.. మహేష్ నవ్వుతున్నట్లుగా ఉన్న ఈ పిక్‌ని షేర్‌ చేస్తూ.. ‘ఇది సరిలేరు నీకెవ్వరు అందించిన విజయానందం..’ అంటూ క్యాప్షన్‌ను జతచేసింది నమ్రత. మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్‌ ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాడు.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala