అమ్మల జాతరకు మనమూ వెళ్లొద్దామా..!
శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం(బెల్లం) మొక్కులు.. వెరసి గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వనదేవతల పండగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. కోరుకున్న కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ జాతరకు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గాంచిన ఈ జాతరకు తెలంగాణవ్యాప్తంగానే కాదు.. దేశవిదేశాల నుంచీ కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.. అమ్మల ఆశీర్వాదాలు అందుకుంటారు.. భక్తి పారవశ్యంలో మునిగితేలుతారు. రెండేళ్లకోసారి జరిగే ఈ పండగకు ఎప్పటిలాగే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో అమ్మల వనమంతా జనసంద్రంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర పండగగా గుర్తింపు పొందిన ఈ జాతర ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మేడారం జాతరకు సంబంధించిన కొన్ని విశేషాలు మీకోసం..
Know More