నమ్మిన వారే మనల్ని నట్టేట ముంచేస్తారు!
మొన్న సుశాంత్.... నిన్న సమీర్... నేడు అనుపమా పాథక్... సినీ పరిశ్రమలో వరుస ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. డిప్రెషన్, ఆర్థికంగా.. ఇలా కారణాలేవైనా కానీ ఈ వరుస బలవన్మరణాలు ముంబైవాసులతో పాటు అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా భోజ్‌పురి నటి అనుపమా పాథక్ (40) ముంబైలో బలవన్మరణానికి పాల్పడింది. బిహార్‌కు చెందిన ఆమె భోజ్‌పురి సినిమాలు, టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే నమ్మిన వారే తనను మోసం చేశారంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ తన ఇంట్లోనే తనువు చాలించుకుంది. ఈ మేరకు సంఘటనా స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులు ఆమెది ఆత్మహత్యేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Know More