సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

సమంత బ్యూటీ సీక్రెట్ ఇదేనట!

వెండితెరపై అందాల తారల్ని చూసినప్పుడల్లా ‘అబ్బ.. వీళ్లెంత అందంగా ఉన్నారో.. ఇదంతా మేకప్‌ మాయాజాలమేమో..’ అని మనలో చాలామంది అనుకోవడం సహజమే. అయితే మేకప్‌ వేసుకున్నప్పుడే కాదు.. మామూలుగానూ అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోతుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. మరి, దీనికంతటికీ కారణమేంటో తెలుసా..? వారు రోజూ పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే. ఇలా తాము పాటించే న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు కొందరు తారలు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటూ మన ముందుకొచ్చేసింది అందాల సమంత. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలే కాదు.. తాను చేసే వ్యాయామాలు, పాటించే ఆహార నియమాలు.. వంటివన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది సామ్‌. ఇక ఇప్పుడు తాను పాటించే ఓ న్యాచురల్‌ బ్యూటీ టిప్‌ని పంచుకుంటూ బ్యూటీ పాఠాలు నేర్పుతోందీ తెలుగందం.

Know More

women icon @teamvasundhara

సమంతలాగా మైక్రో గ్రీన్స్‌ క్యాబేజీని పండించేస్తారా?

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవలే సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించింది. దీంతో మళ్లీ ‘బ్యాక్‌ టు వర్క్‌’ అంటూ సినీ తారలు మేకప్‌ వేసుకునేందుకు రడీ అవుతున్నారు. అయితే ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దీంతో లాక్‌డౌన్ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని సినీతారలు బాగానే ఆస్వాదిస్తున్నారు. కొందరు కొత్త విషయాలను నేర్చుకుంటుంటే, మరికొందరు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా లాక్‌డౌన్‌ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటోంది. కుకింగ్‌, గార్డెనింగ్‌కు సంబంధించి కొత్త విషయాలు నేర్చుకుంటోంది.

Know More

women icon @teamvasundhara

మన కంచం నిండాలంటే ఎంత కష్టపడాలో ఇప్పుడే అర్థమవుతోంది!

దశల వారీగా లాక్‌డౌన్ సడలింపులిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా సినిమా షూటింగ్‌లకు అనుమతివ్వలేదు. దీంతో సినిమా స్టార్లందరూ ఇంకా స్వీయ నిర్బంధంలోనే గడుపుతున్నారు. ఇంట్లోనే ఉంటూ తాము చేస్తోన్న పనులను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు కిచెన్‌లో దూరి తమ పాక శాస్ర్త ప్రావీణ్యానికి పదును పెడుతున్నారు. వెరైటీ వంటకాలను తయారుచేస్తూ ఆ విషయాలను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. ఈక్రమంలో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రుచికరంగా వంటలు చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది సమంత.

Know More

women icon @teamvasundhara

ఇప్పటికే మూడు పచ్చళ్ల బాటిళ్లను అవగొట్టేశాను!

ఓవైపు సినిమాలతో మాయ చేస్తూ...మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. పెళ్లయ్యాక నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తూ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల తార లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. భర్త నాగచైతన్యతో కలిసి కసరత్తులు, వంటలు చేస్తోంది. అనంతరం ఆ విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది. ఈక్రమంలో తాజాగా ట్విట్టర్‌ అభిమానులతో ముచ్చటించింది సామ్‌. సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎంతో సరదాగా, చలాకీగా ఉండే ఆమె ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు అంతే సరదాగా సమాధానాలిచ్చింది. మరి సామ్‌, ఫ్యాన్స్‌ మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

కోటిమంది ప్రేమాభిమానాలకు ప్రతీక ఇది !

సమంత... తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. పెళ్లయ్యాక కథాబలమున్న చిత్రాల్లో నటిస్తూ, విభిన్న తరహా పాత్రల్లో ఒదిగిపోతూ సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకుందీ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్‌ చేస్తుంటుంది. ఇలా నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటున్న సామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా పది మిలియన్ల(కోటి)కు చేరుకోవడం విశేషం.

Know More

women icon @teamvasundhara

నా భర్త చాలా అందంగా ఉన్నాడు కదా!

సమంత... సినిమాలతోనే కాదు వ్యక్తిత్వంతోనూ వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్‌. మూడేళ్ల క్రితం నాగచైతన్యతో మూడుముళ్లు వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. సమయానికి తగ్గట్లుగా సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా...తన భర్త చైతూపై సరదా కామెంట్లతో పోస్ట్‌లు పెడుతుంటుంది. అందుకు తగ్గట్టే చైతూ కూడా సరదాగా స్పందిస్తుంటాడు. ఈక్రమంలో టాలీవుడ్‌లో అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ మరోసారి సోషల్‌ మీడియా వేదికగా సరదా పోస్టులతో ఒకరినొకరు ఆటపట్టించుకున్నారు.

Know More

women icon @teamvasundhara

అదే మా అన్యోన్యత రహస్యం!

నటి సమంత పెట్‌ లవర్‌ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం సామ్ ‘హాష్‌’ అనే శునకాన్ని పెంచుకుంటోంది. ఇంట్లో ఉన్నప్పుడు తన పెంపుడుకుక్కకు కూడా సమయం కేటాయిస్తూ దాంతో ఆడిపాడుతుందీ బ్యూటీ. ఈ క్రమంలో తన కుక్కతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో కూడా పోస్ట్‌ చేస్తుంటుంది సామ్‌. ఒక్క మాటలో చెప్పాలంటే చై, సామ్‌లు దీన్ని తమ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. మరి నిజంగానే ‘హాష్‌’కు మాటలు వస్తే తన మమ్మీకి (సమంతకు) శుభాకాంక్షలు ఎలా చెబుతుంది.? ఇలా ఆలోచిస్తేనే ఆసక్తిగా ఉంది కదూ..! అయితే ఈ ఆలోచననే ఆచరణలో పెట్టారు ‘ఓ బేబీ’ చిత్ర యూనిట్‌.

Know More

women icon @teamvasundhara

నేను ఎంచుకున్న.. నన్ను ఎంచుకున్న జీవితానికి థ్యాంక్స్‌!

ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి.. పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సమంత. గ్లామర్‌, లేడీ ఓరియంటెడ్‌, హోమ్లీ, థ్రిల్లర్‌, ప్రయోగాత్మక, సందేశాత్మక, సెంటిమెంట్‌.. ఇలా ఏ జోనర్‌కు చెందిన పాత్రైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడం సామ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ట్యాలెంట్‌, శ్రమించేతత్వం, సరైన కెరీర్‌ ప్లానింగ్‌ ఉంటే హీరోయిన్లు వివాహం తర్వాత కూడా తమ ఫామ్‌ను కొనసాగించొచ్చని చెప్పడానికి సమంతే ఓ ఉదాహరణ. అయితే కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్‌లో ఉండడం సామ్‌ ప్రత్యేకత. ఏప్రిల్‌ 28 సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..!

Know More

women icon @teamvasundhara

ఆ విషయం చెబితే ‘నీకు పెళ్లైంది కదా’ అన్నాడు!

సమంత... సినిమాలతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్‌. 2017లో నాగచైతన్యతో ఏడడుగులు నడిచిన ఆమె ప్రస్తుతం కథాబలమున్న సినిమాల్లోనే నటిస్తూ వరుస విజయాలు అందుకుంటోంది. ఇక సినిమాలతో పాటు ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందీ ముద్దుగుమ్మ. ఇటీవల ఓ కొత్త పాఠశాల ప్రారంభించి విద్యా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా హైదరాబాద్‌ టైమ్స్‌ ‘మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌-2019’ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మనం ధరించే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్వచించవంటూ తన అభిప్రాయాలు పంచుకుంది.

Know More

women icon @teamvasundhara

వామ్మో సమంత.. మళ్లీ 100 కిలోలు ఎత్తేసింది !

తన క్యూట్‌ లుక్స్‌తో సినీ అభిమానులను మెస్మరైజ్‌ చేసే టాలీవుడ్‌ ‘ఓ బేబి’ అక్కినేని సమంత. అటు గ్లామర్‌తో పాటు ఫిట్‌నెస్‌కి కూడా సమ ప్రాధాన్యమిచ్చే ఈ లవ్లీ లేడీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం వ్యాయామం చేయడం మాత్రం మరవదు. తను జిమ్‌లో చేసే వివిధ రకాల కసరత్తుల వీడియోలను సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానులకు ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్పుతుంది సామ్‌. ఇక తను చేసే వర్కవుట్లను చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..! ఎంతో కఠినంగా ఉండే వర్కవుట్లను సైతం అలవోకగా చేసేస్తూ అందరికీ ఫిట్‌నెస్‌ గురూగా మారిన జానూ.. తాజాగా మరో వర్కవుట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Know More

women icon @teamvasundhara

‘పదేళ్లు’గా మాయ చేస్తూనే ఉంది ..!

‘ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్నా ఈ గుండెకేమవ్వలా..! నిన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేశావే.. పిల్లి మొగ్గలేసిందిలా..!’ .. ‘ఏమాయ చేసావె’ సినిమాలోని ఈ పాట వింటే మన కళ్లముందు కదలాడే రూపం స్మైలింగ్‌ బ్యూటీ సమంతది కాక మరెవరిది..! ఈ పాట మాత్రమే కాదు.. ఈ సినిమా కూడా సినీ ప్రేమికులను ఎంతలా మాయ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ అపురూప దృశ్యకావ్యం 2010లో విడుదలైంది. ఇందులోని పాటలు, సన్నివేశాలు, సంభాషణలు, లొకేషన్లు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ సినిమా సమంతకు నటిగా తొలిచిత్రం. అంతేకాదు, ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నాగ చైతన్య, సమంతల మధ్య ప్రేమకు బీజం పడింది. ఇన్ని ప్రత్యేకతలున్న ‘ఏమాయ చేసావె’ సినిమా విడుదలై సరిగ్గా దశాబ్దమైంది. అంటే సమంత నటిగా తన కెరీర్‌ను ప్రారంభించి కూడా దశాబ్దం పూర్తయ్యింది అన్నమాట. ఈ సందర్భంగా ఈ పదేళ్లలో సామ్‌ తన నటనతో మెప్పించిన కొన్ని మరపురాని పాత్రలను ఒకసారి గుర్తు చేసుకుందాం రండి..!

Know More

women icon @teamvasundhara

అరె.. అచ్చం మన ‘జాను’లా ఉందే!

సాధారణంగా అమ్మాయిలు అందంగా ఉంటే హీరోయిన్లతో, అబ్బాయిలను హీరోలతో పోల్చడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కేవలం ఒకటో, రెండో పోలికలు కాకుండా పూర్తిగా అచ్చుగుద్దినట్లు సెలబ్రిటీల్లా ఉండేవారి గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇలాంటివారిలో చాలామంది ఫేమస్‌ కూడా అయిపోతున్నారు. అలా ఇంతకుముందు బొద్దుగా ఉన్నా సమంతలాంటి రూపురేఖలతో సెలబ్రిటీ స్టేటస్‌ సంపాదించుకుంది ‘బిగ్‌బాస్‌-3’ ఫేమ్‌ అషురెడ్డి. తాజాగా సమంత పోలికలున్న మరో అమ్మాయి ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. మరి తనెవరో తెలుసుకుందాం రండి..!

Know More

women icon @teamvasundhara

ఆ దేవుడిని ఇంతకంటే ఇంకేం అడగను!

సమంత, శర్వానంద్‌ జంటగా నటించిన ‘జాను’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా ఈ చిత్ర బృందం తాజాగా సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందాల భామ సమంత తన అందంతోనే కాదు.. తన అటైర్‌తోనూ మాయ చేసేసింది. డల్‌ రోజ్‌ కలర్‌ ఇటాలియన్‌ ఆర్గంజా శారీలో ముస్తాబైన సామ్‌.. చక్కటి మేకప్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె చీరపై ముందు భాగంలో పెయింట్‌ చేసిన 'Jaanu' అనే అక్షరాలు, ఫ్లోరల్‌ పెయింటింగ్‌.. వంటివన్నీ చీరకు మరింతగా వన్నెలద్దాయని చెప్పుకోవచ్చు. ఇలా తాను ఎంతో అందంగా ముస్తాబైన ఈ ఫొటోలను సమంత తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేయగా అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, స్పెషల్ లుక్‌లో ముస్తాబైన సామ్‌ ఫొటోలపై మీరూ ఓ లుక్కేసేయండి.

Know More

women icon @teamvasundhara

నా ప్రేమ రోజురోజుకీ రెట్టింపవుతోంది!

నేహా ధూపియా- అంగద్‌ బేడీ.. పరిచయం అవసరం లేని బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ వీరు. 2018, మేలో అత్యంత రహస్యంగా వివాహమాడిన ఈ చూడముచ్చటైన జంట.. అదే ఏడాది నవంబర్‌లో మెహ్ర్‌ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సందర్భమేదైనా ఈ క్యూట్‌ కపుల్‌ తమ మధ్య ఉన్న ప్రేమను ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ తమ దాంపత్య బంధాన్ని నిత్యనూతనం చేసుకుంటున్నారు.. తమ ఫ్యాన్స్‌కు దాంపత్య పాఠాలు నేర్పుతున్నారు. ఈరోజు అంగద్‌ పుట్టినరోజు.. ఈ సందర్భంగా తన భర్తకు విషెస్‌ చెబుతూ ఇన్‌స్టాలో ఓ లవ్లీ పోస్ట్‌ పెట్టింది నేహ.

Know More

women icon @teamvasundhara

‘జాను’ను వదిలేద్దామనుకున్నా ..!

జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ప్రేమలో పడాల్సిందే. అయితే ప్రేమించిన వారినే పెళ్లిచేసుకుంటారా? అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ జీవితంలో మొదట పరిచయమైన తొలిప్రేమను ఎప్పటికీ మరిచిపోలేరని చెబుతుంటారు. ఇలా పదో తరగతిలో ప్రేమలో పడ్డ ఓ జంట అనుకోని కారణాల వల్ల విడిపోతారు.. తిరిగి కొన్నేళ్ల తర్వాత స్కూల్‌ రీయూనియన్‌లో భాగంగా కలుసుకుంటారు. ఆ సందర్భంలో వారిద్దరి మధ్య సాగే ఎమోషనల్‌ జర్నీ కథాంశంతో తెరకెక్కిందే ‘జాను’ చిత్రం. సమంత, శర్వానంద్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా.. తమిళంలో సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన ‘96’ చిత్రానికి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం (వాలంటైన్‌ వీక్‌) సందర్భంగా ఫిబ్రవరి 7 (శుక్రవారం) విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లలో భాగంగా నటి సమంత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఈ క్రమంలో సినిమా గురించి సామ్‌ చెప్పిన కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం...

Know More

women icon @teamvasundhara

చివరిదాకా నీతోనే ఉంటానని మాటిస్తున్నా డియర్‌!

తమ మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్‌’తో పరిచయమై, ఆ స్నేహబంధాన్ని ప్రేమగా మార్చుకొని 2002లో పెళ్లిపీటలెక్కారు బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌ జెనీలియా-రితేశ్‌ దేశ్‌ముఖ్‌. అయితే ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టి నిన్నటితో ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా తామిద్దరూ వివిధ సందర్భాల్లో దిగిన కొన్ని ఫొటోలను కొలేజ్‌ చేసి రూపొందించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది జెన్నీ. వీడియో షేర్‌ చేస్తూ.. ‘నా ప్రియమైన భర్తకు భార్యగా ఉండడమంటే నాకెంతో ఇష్టం. చివరిదాకా నీతోనే ఉంటానని, రాబోయే రోజులు ఇంకా అద్భుతంగా ఉంటాయని నీకు మాటిస్తున్నాను. పెళ్లిరోజు శుభాకాంక్షలు..’ అంటూ ప్రేమగా రాసుకొచ్చిందీ లవ్లీ బ్యూటీ.

Know More

women icon @teamvasundhara

జాను.. ఐలవ్యూ!

‘జాను’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది నటి సమంత. తాజాగా చిత్ర ప్రమోషన్లలో పాల్గొంటున్న సామ్‌ ఆ విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఇక సమంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన క్రేజ్‌ సామ్‌ సొంతం. తాజాగా సమంత అభిమాని ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఈ వీడియోపై ఏకంగా సమంతనే స్పందించడం విశేషం. నోట్‌బుక్‌ పేజీలను ‘ఐలవ్యూ సామ్‌’తో నింపి.. మధ్యలో రెడ్‌ పెన్నుతో ‘జాను’ అని రాసి, ఆ పక్కనే రెడ్‌ కలర్‌ లవ్‌ సింబల్‌ వేసిన పుస్తకంలోని పేజీల్ని చూపిస్తున్న వీడియోను ఓ అభిమాని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో పాటు ‘ఇది రాయడానికి నాకు మూడు గంటలకుపైగా సమయం పట్టింది. మా అమ్మ తిడుతున్నా కూడా నేను రాయడం ఆపలేదు. నీపై నాకున్న ప్రేమ ఎప్పటికీ ఆగిపోని ప్రయాణం లాంటిది సామ్‌’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్‌ను సమంత రీట్వీట్‌ చేస్తూ.. ‘మీ అమ్మ నాపై కచ్చితంగా కోపగించుకుంటుంది. నువ్వు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞురాలిని. కానీ ముందు నువ్వు బాగా చదువుకో ప్లీజ్‌’! అంటూ క్యాప్షన్‌ను జోడించిందీ బ్యూటిఫుల్‌ యాక్ట్రెస్‌.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala