థైరాయిడ్ ఉన్న వారు గర్భం ధరించలేరా?
నిజానికి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు తెలియకుండానే కొన్ని అనారోగ్యాలు మనల్ని చుట్టుముడతాయి. దురదృష్టవశాత్తూ వాటి వల్ల మన ఆరోగ్యానికి జరగకూడని నష్టం జరిగేదాకా వాటిని గుర్తించలేం. థైరాయిడ్ కూడా అలాంటి వ్యాధే! బరువు పెరగడం/తగ్గడం, అలసట, నీరసం, నెలసరి సమస్యలు, పొడి చర్మం, మలబద్ధకం.. ఇలా దీనివల్ల మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే సమస్యలెన్నో! ఇదిలా ఉంటే థైరాయిడ్ గురించి చాలామందిలో చాలా అపోహలే నెలకొన్నాయి. ఒకవేళ దీని బారిన పడితే నయమవుతుందా? థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరేమో? థైరాయిడ్ ఉన్న వాళ్లు గర్భం ధరించినా ఆ సమయంలో మందులు వాడడం మంచిదో? కాదో? ఇలా దీని గురించి ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన సందేహాలు, అపోహలు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ సమస్యను అదుపు చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. జనవరిని ‘జాతీయ థైరాయిడ్ అవగాహన మాసం’గా జరుపుకుంటోన్న సందర్భంగా థైరాయిడ్ సమస్యపై నెలకొన్న కొన్ని అపోహలు, వాటి వెనక దాగున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం రండి..
Know More