సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

మా ఆయన నన్ను దగ్గరకు రానివ్వడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఆస్పత్రికి వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

సుదీర్ఘ లాక్‌డౌన్‌కి తెరదించుతూ ప్రభుత్వం దశలవారీగా కొన్ని సడలింపులిస్తోంది. దీంతో అన్ని రంగాల్లోనూ పనులు మొదలయ్యాయి. ఇక లాక్‌డౌన్‌ కాలంలో చాలా రోజుల పాటు ఎమర్జెన్సీ సేవలకే పరిమితమైన ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులున్న రోగులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఆర్థిక కారణాలతో లాక్‌డౌన్‌ సడలింపులిచ్చినా కరోనా వైరస్‌ మన మధ్యే ఉందన్నది జీర్ణించుకోలేని వాస్తవం. ఈ పరిస్థితుల్లో వివిధ కారణాలతో ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లే రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Know More

women icon @teamvasundhara

ఇంటిని ఇలా ఈజీగా శుభ్రం చేసేయండి!

ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటి పరిశుభ్రతని బట్టి ఇల్లాలి సమర్థతని అంచనా వేయచ్చనేది ఈ సామెత సారాంశం. అయితే అసలే కరోనా కాలం.. కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో కేవలం చేతులు శుభ్రం చేసుకోవడం.. ఇంటి ఫ్లోర్‌ని క్లీన్‌ చేస్తూ అదే పరిశుభ్రత అని భావిస్తే సరిపోదు. ఇంట్లోని దుమ్ము దులిపి, అనవసరమైన వస్తువులను తొలగిస్తూ ఇంటిని సమూలంగా శుభ్రం చేసినప్పుడే వైరస్‌, బ్యాక్టీరియా లాంటివి దరిచేరకుండా ఆపగలం. పైగా రోజూ ఉరుకులు పరుగులతో పోలిస్తే ఈ లాక్‌డౌన్‌లో అటు గృహిణులకు, ఇటు ఇంటి నుంచి పనిచేసే మహిళలకు ఎంతో కొంత ఖాళీ సమయం దొరుకుతుండచ్చు. కాబట్టి ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఇదే మంచి తరుణం. అయితే అందుకోసం మరీ కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

Know More

women icon @teamvasundhara

నిత్యావసరాలు సరే... శానిటరీ న్యాప్‌కిన్ల సంగతేంటి?

కరోనా ఉపద్రవాన్ని అధిగమించేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ వైరస్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు ఆయా ప్రభుత్వాలు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఈక్రమంలో మన దేశంలో కూడా కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దురదృష్టవశాత్తూ లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది పేదలు, వలస కార్మికులకు సరిగా తిండి కూడా దొరకడం లేదు. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు వీరికి కావలసిన నిత్యావసర సరుకులను అందిస్తూ సాధ్యమైనంతవరకు వారిని ఆదుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో మహిళల గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని సూచిస్తోంది మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషీ చిల్లర్‌. ఇందులో భాగంగా ఆడవారి నెలసరి పరిశుభ్రతకు సంబంధించి ఓ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Know More

women icon @teamvasundhara

ఈ లాక్‌డౌన్‌ సెలవుల్లో ఇంటిని శుభ్రపరచండిలా..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో గడిపే అవకాశం లభించిందని తృప్తి పడుతున్నారు. ఈ అనుకోని సెలవుల కారణంగా అప్పటిదాకా క్షణం తీరిక లేకుండా గడిపిన మనకు చిన్న విరామం దొరికినట్లయ్యింది. ఈ కరోనా హాలిడేస్‌.. చదువుకునే రోజుల్లో సమ్మర్‌ హాలిడేస్‌ని తలపిస్తున్నాయని అనుకుంటున్నారు చాలామంది. అయితే ఈ సమయాన్ని ఆట, పాటలతో గడిపే వాళ్లు కొందరైతే.. అరుదుగా దొరికిన ఇలాంటి అవకాశాన్ని ఉపయోగకరమైన పనులు చేయడం కోసం వినియోగిస్తోన్న వారు మరికొందరు. ఇక చాలామంది అతివలైతే ఈ సెలవులను ఇంటిని క్లీన్‌ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మరి, ఈ లాక్‌డౌన్‌ సమయంలో ఇంటిని పరిశుభ్రంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Know More

women icon @teamvasundhara

కరోనా అలర్ట్‌: బయటికెళ్లొస్తే ఇలా చేయండి..!

కరోనా మహమ్మారి విజృంభణ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. రోజురోజుకీ వైరస్‌ ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. ఎక్కడి వాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమవుతున్నారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. బతికుంటే చాలు భగవంతుడా అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే నిత్యావసర వస్తువుల పరిస్థితి ఏంటి? ఇందుకోసమే అధికారులు ఉదయం కాసేపు కర్ఫ్యూని సడలిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే కూరగాయలు, కిరాణా సామాన్లు తెచ్చుకుంటున్నాం. అయితే బయటకు వెళుతోన్న వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తిరిగి ఇంట్లోకి వస్తే మాత్రం ప్రమాదమే అని నిపుణులు చెబుతున్నారు. మరి, ఈ కరోనా కఠిన పరిస్థితుల్లో బయట తిరిగిన వ్యక్తి ఇంట్లోకి వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

‘కరోనా’ అచ్చట్లు.. ముచ్చట్లు..!

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కరోనా (కొవిడ్‌-19) వైరస్‌కు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి.. కనిపిస్తున్నాయి. ఏ సోషల్‌ మీడియా అకౌంట్‌ తెరిచినా సరే.. ఈ దేశంలో ఇలా జరిగింది.. అక్కడ ఇన్ని కొత్త కేసులు నమోదయ్యాయి.. అంటూ సర్వం ‘కరోనా’ మయం. ఇక కరోనా వ్యాపిస్తోన్న తీరు కూడా భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆదివారాన్ని (మార్చి22) ‘జనతా కర్ఫ్యూ’గా పాటించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై స్వీయ నిర్బంధాన్ని పాటించాలని సూచించారు. ఇక కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పలు కార్యక్రమాలు చేపడుతోన్న విషయం తెలిసిందే. అందులో కొన్ని విభిన్నమైన క్యాంపెయిన్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.. నెట్‌ ప్రియులను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.. కరోనాపై అందరిలో అవగాహన పెంచుతున్నాయి.

Know More

women icon @teamvasundhara

‘కరోనా.. నాకెందుకొస్తుంది?’ అన్న ధీమా వద్దు!

ఎప్పుడు భయపడకూడదో కాదు, ఎప్పుడు భయపడాలో కూడా తెలియాలి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ (కొవిడ్‌-19) విషయంలో ఇప్పుడిలాంటి భయమే కావాలి. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా వైరస్‌ మనదేశంలో అంత తీవ్రంగా ప్రబలటం లేదు. అంత ప్రమాదకరంగా పరిణమించటం లేదు. కొందరికి ఇన్‌ఫెక్షన్‌ పూర్తిగా నయమైంది కూడా! ఇవన్నీ కరోనాకు అంతగా భయపడాల్సిన పనిలేదనే ధైర్యాన్ని ఇస్తుండచ్చు.. అంతమాత్రాన ‘కరోనా నాకెందుకొస్తుందిలే’ అన్న ధీమా గానీ ‘వస్తే ఏం చేస్తుందిలే’ అన్న అతి విశ్వాసం గానీ పనికిరావు. ‘నాకూ వస్తుందేమోనన్న’ భయమే కావాలి. ఎందుకంటే రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మూడు మరణాలూ సంభవించాయి. ఇవన్నీ భయపడాలనే చెబుతున్నాయి. కాస్త శ్రద్ధ పెడితే దీన్ని అడ్డుకోవటం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే కరోనా వైరస్‌ ఎక్కడో లేదు. ఒకరకంగా అది మన చేతుల్లోనే ఉంది! చాలావరకు మన చేతులు, చేతల ద్వారానే మనకూ ఇతరులకూ వ్యాపిస్తోంది.

Know More

women icon @teamvasundhara

ఈ ‘కరోనా’ కథలు విన్నారా..?

అమెరికా నుంచి హైదరాబాద్‌ వరకు ఇప్పుడు అందరినీ భయపెడుతోన్న అంశం ఏదైనా ఉందంటే అది కరోనా వైరసే (కొవిడ్‌-19) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్థిక వ్యవస్థ నుంచి క్రీడలు, సినిమాలు.. ఇలా ప్రతి రంగంపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచం మొత్తం శరవేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లో ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 60దాటింది. మందులేని ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ వైరస్‌ గురించి ప్రజల్లో అవగాహన పెంచే నేపథ్యంలో పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా ఏ స్థాయిలో వ్యాపిస్తోందో.. ఆ వైరస్‌కు సంబంధించిన వార్తలు కూడా అదే స్థాయిలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న అలాంటి కొన్ని వార్తలపై ఓ లుక్కేద్దామా..?

Know More

women icon @teamvasundhara

ఆ పాఠశాలలో ‘కరోనా రైమ్స్‌’ కూడా నేర్పుతారు!

చైనాతో పాటు పలు ఆసియా దేశాలను వణికిస్తున్న కొవిడ్‌-16 వైరస్‌ (కరోనా) క్రమంగా భారతదేశంలోనూ విస్తరిస్తోంది. చైనా, ఇటలీ తదితర దేశాల్లాంటి దారుణ పరిస్థితులు ఇక్కడ లేనప్పటికీ రోజురోజుకూ కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇదే దేశ ప్రజల ఆందోళనకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కరోనా కట్టడికి వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నాయి. ఇక వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా గర్భిణులు, చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పలువురు వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఈ క్రమంలో వారణాసిలోని ఓ పాఠశాల తమ విద్యార్థుల కోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా బారిన పడకుండా చిన్నారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో(Do’s ), ఎలాంటి పనులు చేయకూడదో(Don’t) జాబితాలను రూపొందించిందా పాఠశాల యాజమాన్యం.

Know More

women icon @teamvasundhara

కరోనాతో జాగ్రత్త.. చేతులు కడిగే పద్ధతి ఇదే..!

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న కరోనా భూతం మన దేశంలోకి.. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోకీ చొరబడింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు ఆరోగ్య సంస్థలు సైతం కరోనా గురించి భయభ్రాంతులకు గురికావొద్దని.. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ వ్యాధిని అదుపు చేయొచ్చని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ వ్యాధి కరచాలనం ద్వారా ఒకరినుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వద్దని; గంటగంటకూ సబ్బు, శుభ్రమైన నీటితో చేతులను కడుక్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. సబ్బుతో చేతులను ఎంతసేపు కడగాలి? ఎలా శుభ్రం చేసుకోవాలి..? మొదలైన విషయాల గురించి కూడా వాళ్లు సవివరంగా చెబుతున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

వ్యక్తిగత పరిశుభ్రతే కరోనాకు విరుగుడు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ మన గడప దాకా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఏర్పడిందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరచాలనం కన్నా నమస్కారం చేయడం శ్రేయస్కరమని, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం మంచిదంటున్నారు. అదేవిధంగా ఈ వైరస్‌ సోకిన వారిలో చనిపోతున్న వారి సంఖ్య సగటున 1% మాత్రమేనని, మృతుల్లోనూ 40% మందికి పైగా రోగ నిరోధకశక్తి తక్కువున్న 60 ఏళ్లకు పైబడిన వారేనని చెబుతున్నారు. కాబట్టి కరోనాపై హైరానా వద్దని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఈ వైరస్‌ మనల్ని ఏమీ చేయలేదని సూచిస్తున్నారు.

Know More

women icon @teamvasundhara

శుభ్రంగా ఉంటే సుబ్బరంగా బతికేయవచ్చు!

‘కొవిడ్‌-19’ గా పేరు మార్చుకున్న కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 3వేలమందిని పైగా బలి తీసుకున్న ఈ వైరస్‌ సుమారు 60 దేశాలకు వ్యాపించింది. తాజాగా భారతదేశంలోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లోనూ ఒక కొవిడ్‌ కేసు వెలుగుచూసింది. దుబాయి నుంచి బెంగళూరు మీదుగా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధరణ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోషల్‌ మీడియా వేదికగా అవగాహన కల్పించింది మెగాస్టార్‌ కోడలు కొణిదెల ఉపాసన.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై 8 నెలలవుతోంది. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్త నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను తనతో ఎంత బాగా ఉండాలనుకున్నా తను మాత్రం నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. ఈ విషయంలో తనలో మార్పు వస్తుందేమోనని కొన్ని రోజులు వేచి చూశాను. కానీ, ఎలాంటి మార్పూ రాలేదు. దాంతో ఇదే విషయాన్ని మా తల్లిదండ్రులకు చెప్పాను. పెళ్లైన రెండు నెలల వరకు బాగున్నాడు. తర్వాత నుంచే తనలో ఈరకమైన మార్పు వచ్చింది. ఇంట్లో వాళ్ల కంటే బయటి వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. మా తల్లిదండ్రులు ‘విడాకులు తీసుకుందాం’ అంటున్నారు. అయితే అతను మాత్రం ఎవరు ఏం చెప్పినా సమాధానం ఇవ్వడం లేదు. మౌనంగా కూర్చుంటున్నాడు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

ముందుగా
మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయనేది స్పష్టత రావాలి. మొదట శారీరక అనుబంధం దృఢంగా ఉండి, తర్వాత మీ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందా? లేదా మొదట్నుంచీ శారీరక అనుబంధంలో స్పష్టత లేదా? అనేది ఒక కోణం. మరొక కోణం ఏంటంటే మొదటి రెండు నెలలు మీ ఇద్దరి మధ్య అన్నీ బాగుండి, తర్వాత ఇద్దరి మధ్య దూరం ఏర్పడి.. ఇతరులకు ప్రాధాన్యం ఇస్తూ మీకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడంటే.. ఆ రెండు నెలల తర్వాత మార్పు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ల వల్ల అలా చేస్తున్నాడా? లేదా మీ ఇద్దరి మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు, సంఘర్షణలు, అసంతృప్తులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. వాటి గురించి మాట్లాడుకోవడం జరిగిందా? అనేవి ఆలోచించుకోండి.
మీరిద్దరూ కూడా మ్యారేజ్‌ కౌన్సెలింగ్ కి వెళ్లడం మంచిది. దానివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగుతాయేమో చూడండి. ఈ రోజుల్లో ఎన్నో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శారీరక సమస్యలేవైనా ఉంటే వాటిని పరిష్కరించుకునే దిశగా ఆలోచించండి. అలాగే ఒకరినొకరు తక్కువ చేసుకోకుండా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించండి.
0 Likes
Know More

Movie Masala