సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

పండ్లు, కాయగూరలను ఇలా శానిటైజ్‌ చేయండి!

ప్రస్తుతం కరోనా విజృంభిస్తోన్నా కొన్ని సార్లు బయటికి వెళ్లక తప్పని పరిస్థితి. వృత్తిఉద్యోగాల రీత్యా మాత్రమే కాదు.. నిత్యావసరాలు, రోజువారీ కాయగూరలు, పండ్ల కోసం ఇంట్లో నుంచి ఎవరో ఒకరు కచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే! ఇలా ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే! మరి, ప్యాక్‌ చేసిన వస్తువులు, ఆహార పదార్థాలపైన శానిటైజర్‌ స్ప్రే చేయడం లేదంటే క్లాత్ సహాయంతో వాటిపై అప్లై చేయడం వంటివి చేయచ్చు. మరి, పండ్లు, కాయగూరల సంగతేంటి? అన్నింటిలాగే వాటిపైనా శానిటైజర్‌ స్ప్రే చేస్తే అందులోని ఆల్కహాల్‌ ప్రభావానికి పండ్లు, కాయగూరల్లోని పోషకాలు నశించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసుకున్న ద్రావణాలతోనే వీటిని కడగాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఆ న్యాచురల్‌ క్లీనర్స్‌ని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

Know More

women icon @teamvasundhara

కరోనా అలర్ట్‌: మేకప్‌ కిట్‌ని శానిటైజ్‌ చేయండిలా !

ఈ కరోనా సమయంలో ఏ వస్తువును ముట్టుకున్నా, పట్టుకున్నా భయంగానే అనిపిస్తోంది. అందుకే బయటి నుంచి రాగానే హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం, పదే పదే శానిటైజర్‌ని వాడడం కామనైపోయింది. అయితే చేతులు శుభ్రం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ కొన్ని వస్తువుల్ని ఎలా శానిటైజ్‌ చేయాలో అర్థం కాక తికమకపడిపోతుంటాం. అలాంటి వాటిలో మనం రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు కూడా ఒకటి. మేకప్‌ బాక్స్‌నైతే శానిటైజర్‌తో శుభ్రం చేసేస్తాం.. మరి, అందులో ఉన్న ఉత్పత్తుల సంగతో! పౌడర్‌, క్రీమ్‌, మేకప్‌ బ్రష్‌లు.. వంటి వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తద్వారా వాటిని అలాగే అపరిశుభ్రంగా ఉపయోగించడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం వల్ల మనం రోజువారీ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు, మేకప్‌ ఉత్పత్తుల్ని ఈజీగా శానిటైజ్‌ చేయచ్చంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

మన ప్రమేయం లేకుండానే శానిటైజ్ చేసేస్తాయి!

ఈ కరోనా ఏమో గానీ ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువును శానిటైజ్‌ చేయలేక గృహిణులకు తలప్రాణం తోకకొస్తోంది. కాయగూరలు-పండ్ల దగ్గర్నుంచి నిత్యావసర సరుకుల దాకా, డోర్‌ హ్యాండిల్స్‌ దగ్గర్నుంచి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ల దాకా.. ఇలా మనం రోజూ వాడే, తినే ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయందే లోపలికి అనుమతించట్లేదు. ఓ రకంగా ఇంట్లో ఇతర పనుల కంటే ఇదే పెద్ద పనిలా అనిపిస్తుంది. ఒక్కోసారి ఓపిక నశించిపోతుంది. అయినా తమ ఆరోగ్యం, ఇంట్లో వారి క్షేమం కోసం ఓపికను కూడగట్టుకుంటున్నామంటున్నారు ఎంతోమంది మహిళలు! అయితే ఇకపై ఇంత కష్టపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మన ప్రమేయం లేకుండా ఆయా వస్తువుల్ని, ఇంటిని స్వయంగా శానిటైజ్‌ చేసే కొన్ని గ్యాడ్జెట్స్‌ ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ క్రమంలో వాటి ఫీచర్లను బట్టి కొన్ని అందుబాటు ధరల్లో లభిస్తే, మరికొన్నింటికి కాస్త ఖరీదు పెట్టాల్సిందే! ఏదేమైనా ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో శుభ్రం చేసే విషయంలో మన కష్టాన్ని తగ్గిస్తున్నాయంటే మనకు సంతోషమే కదా! పైగా వీటిని ఒకసారి కొనేస్తే ఇక ఎప్పటికీ మనకు ఉపయోగపడతాయి. మరి, అలాంటి కొన్ని సెల్ఫ్‌ శానిటైజింగ్‌ గ్యాడ్జెట్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

పిల్లలు మళ్లీ స్కూలుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

కరోనా కారణంగా గత ఏడాది కాలంగా స్కూళ్లు మూతపడడంతో పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వాళ్ల అల్లరికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయితే గత కొన్ని నెలల నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నప్పటికీ పలు కారణాల రీత్యా అవి అందరికీ చేరువ కాలేదనే చెప్పాలి. ఏదేమైనా తరగతుల వారీగా తిరిగి స్కూళ్లను తెరుస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యం కోసం, వైరస్‌ నుంచి వారికి పూర్తి రక్షణ కల్పించే చర్యలను చేపడుతున్నాయి. అయితే స్కూల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పిల్లల్ని కూడా కొన్ని విషయాల్లో అలర్ట్‌గా ఉంచమని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు. కొవిడ్‌ బారిన పడకుండా చిన్నారులతో తగిన జాగ్రత్తలు పాటింపజేయాలని చెబుతున్నారు. మరి, పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైరస్‌ బారిన పడకుండా పిల్లల్ని సురక్షితంగా ఉంచాలంటే తల్లిదండ్రులు వారితో ఎలాంటి జాగ్రత్తలు పాటింపజేయాలి? ఇంకా ఎలాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలి? తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

కరోనా వేళ వేడుకలా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

ఓవైపు దీపావళి-క్రిస్మస్‌ పండగలు.. మరోవైపు పెళ్లిళ్ల హడావిడి.. ఇంకోవైపు చలికాలం మొదలు.. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎటు చూసినా సందడి వాతావరణం నెలకొంటుంది. పండగలు, శుభకార్యాల కోసం ఒకరింటికి మరొకరు వెళ్తుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. కరోనా కారణంగా వేడుకల సందడి తీరు మారింది. అయినప్పటికీ పెళ్లి, ఇతర శుభకార్యాల్లో కొంతమందైనా అతిథుల్ని పిలవడం, లేదంటే మనమే మన దగ్గరి బంధువుల పార్టీలు, వేడుకలకు హాజరవడం.. వంటివి చేస్తున్నాం. అది కూడా కనీస జాగ్రత్తలు పాటిస్తూనే! కానీ ఇలాంటి చిన్న చిన్న గుంపులే కరోనా వైరస్‌ విస్తరణకు కారణమయ్యే అవకాశం ఉందంటోంది వ్యాధి నివారణ, నియంత్రణ మండలి (సీడీసీ). పైగా చలికాలం వైరస్‌కు అనువైన కాలం కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. తద్వారా అటు వేడుకలను ఎంజాయ్‌ చేస్తూనే, ఇటు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరైతే ఆలస్యమెందుకు.. కరోనా వేళ వేడుకలకు/పార్టీలకు హాజరవ్వాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

బ్యుటీషియన్‌ని ఇంటికే పిలుస్తున్నారా? అయితే ఇవి గుర్తుపెట్టుకోండి!

అమ్మాయంటేనే అందం.. అందమంటేనే అమ్మాయి.. ఇలా సౌందర్యానికి మారుపేరుగా నిలిచే అతివలు తమ అందం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కరోనా వచ్చిన దగ్గర్నుంచి పార్లర్స్‌కి వెళ్లే మహిళల సంఖ్య బాగా తగ్గిందని చెప్పుకోవాలి. దానికి బదులుగా కొంతమందైతే ఇంటికే బ్యుటీషియన్స్‌ని పిలిపించుకుంటూ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మరి, మీరూ ఇదే ఆలోచనలో ఉన్నారా? అయితే అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన పరిశుభ్రతా ప్రమాణాలను పాటించకుండా కరోనాను నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిక్కులు తప్పవు. మరి, ఇంతకీ బ్యుటీషియన్‌ని ఇంటికి పిలిపించుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

కరోనా కాలంలో కిచెన్‌ని ఇలా శుభ్రం చేయాల్సిందే!

కరోనా కారణంగా ముట్టుకున్న ప్రతి వస్తువునూ శుభ్రం చేయడం ఇప్పుడు ఆడవాళ్లకు నిత్యకృత్యమైపోయింది. ఎంత తీరిక లేకపోయినా సరే.. తీరిక చేసుకొని, ఓపిక తెచ్చుకొని మరీ ఇంటిని క్రిమి రహితంగా మార్చేస్తున్నారు. అయితే మనం రోజులో ఎక్కువ సమయం గడిపే కిచెన్‌ సంగతేంటి? కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌.. ఇలా మనం వంట చేసే క్రమంలో ఎంత తరచుగా వీటిని ఉపయోగిస్తామో.. అంతే శ్రద్ధగా వీటిని శుభ్రం చేయాలంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. అలాకాకుండా సమయం లేదని, ఓపిక అంతకన్నా లేదని ఏదో పైపైన శుభ్రం చేస్తే బ్యాక్టీరియా, వైరస్‌ వృద్ధి చెందే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే కిచెన్‌ ఎలా శుభ్రం చేయాలో వివరిస్తూ ముచ్చటగా మూడు చిట్కాలను ట్విట్టర్‌లో పంచుకుందీ సంస్థ. వీటితో పాటు కిచెన్‌ను శుభ్రం చేయడానికి పాటించాల్సిన మరికొన్ని చిట్కాలేంటో చూసేద్దాం!

Know More

women icon @teamvasundhara

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

సునీత గృహిణి. ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి పిల్లలిద్దరూ ఇంటి పట్టునే ఉండడం, భర్త ఆఫీసుకు వెళ్లొస్తుండడంతో తనకు ఇంటి పని మరింత పెరిగింది. దీంతో తీరిక లేక కొన్ని వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్న విషయం కూడా మర్చిపోయింది. వినీత గత నాలుగు నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తోంది. ఉదయాన్నే చకచకా ఇంటి పని ముగించుకొని ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుందంటే రాత్రి వరకూ తీరిక లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో ల్యాపీ ఉపయోగించుకోవడం, పనైపోయాక దాన్ని పక్కన పెట్టేయడం తప్ప క్లీన్‌ చేద్దామన్న ఆలోచనే తనకు రాదు.

Know More

women icon @teamvasundhara

కరోనా అలర్ట్‌: బ్యూటీ పార్లర్‌కి వెళ్తున్నారా? అయితే ఇవి పాటించాల్సిందే!

రూప ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. అందాన్ని సంరక్షించుకోవడంలో భాగంగా రెండువారాలకోసారైనా ఫేషియల్‌ చేయించుకోవడం ఆమెకు అలవాటు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలల నుంచి పార్లర్లన్నీ మూతపడడంతో సౌందర్య నిపుణుల సలహా మేరకు ఇంట్లోనే స్వయంగా ఫేషియల్‌ చేసుకుంటోంది. గీతకు అవాంఛిత రోమాల సమస్య ఎక్కువ. వీటిని తొలగించుకోవడానికి పార్లర్‌ను ఆశ్రయిస్తుంటుందామె. అయితే పార్లర్లన్నీ గత రెండు నెలలుగా మూసే ఉండడంతో ఇంట్లోనే వ్యాక్సింగ్‌ చేసుకుంటోంది. అది సరిగ్గా వర్కవుట్‌ కాకపోవడంతో ఎప్పుడెప్పుడు పార్లర్లు తెరుస్తారా అని మొన్నటిదాకా ఎదురుచూసింది. వీళ్లే కాదు.. చాలామంది అమ్మాయిలు, మహిళలు తమ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ కోసం బ్యూటీ పార్లర్లను, స్పా సెంటర్లను ఆశ్రయించడం సహజమే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా మూత పడిన సెలూన్లన్నీ లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో పార్లర్స్‌కి వెళ్లి అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

Know More

women icon @teamvasundhara

కరోనా అలర్ట్‌: మేకప్‌ కిట్‌ని శానిటైజ్‌ చేయండిలా !

ఈ కరోనా సమయంలో ఏ వస్తువును ముట్టుకున్నా, పట్టుకున్నా భయంగానే అనిపిస్తోంది. అందుకే బయటి నుంచి రాగానే హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం, పదే పదే శానిటైజర్‌ని వాడడం కామనైపోయింది. అయితే చేతులు శుభ్రం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ కొన్ని వస్తువుల్ని ఎలా శానిటైజ్‌ చేయాలో అర్థం కాక తికమకపడిపోతుంటాం. అలాంటి వాటిలో మనం రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు కూడా ఒకటి. మేకప్‌ బాక్స్‌నైతే శానిటైజర్‌తో శుభ్రం చేసేస్తాం.. మరి, అందులో ఉన్న ఉత్పత్తుల సంగతో! పౌడర్‌, క్రీమ్‌, మేకప్‌ బ్రష్‌లు.. వంటి వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తద్వారా వాటిని అలాగే అపరిశుభ్రంగా ఉపయోగించడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం వల్ల మనం రోజువారీ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు, మేకప్‌ ఉత్పత్తుల్ని ఈజీగా శానిటైజ్‌ చేయచ్చంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala