సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ కరోనా సమయంలో గర్భం ధరించడం మంచిదా? కాదా?

కరోనా వైరస్‌ మన జీవనశైలి, రోజువారీ పనులపై ఎంతలా ప్రభావం చూపుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో కొంతమంది కొన్ని అతి ముఖ్యమైన పనుల్ని సైతం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మహమ్మారి కారణంగా పిల్లల్ని కనడానికి సైతం భయపడుతున్నారు. ఇప్పటికే సంతానలేమి సమస్యలున్న వారు ఐవీఎఫ్‌/ఐయూఐ.. వంటి సంతాన సాఫల్య మార్గాలను ఆశ్రయించడానికీ వెనకడుగు వేస్తున్నారు. అయితే వైరస్‌ మూలంగా పిల్లల్ని కనే పనిని వాయిదా వేసుకోవడం సరికాదని, తద్వారా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భం ధరించడం మరింత క్లిష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అందుకే వైరస్‌ మన మధ్యే ఉన్నా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోమంటున్నారు.

Know More

women icon @teamvasundhara

కరోనా మా కుటుంబాన్ని ఇంతలా వేధిస్తుందని కలలో కూడా అనుకోలేదు!

ప్రపంచమంతటా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ మాత్రం శాంతించడం లేదు. ‘స్ట్రెయిన్‌’, ‘వేరియంట్‌’, ‘మ్యుటేషన్‌’ అంటూ కొత్త రకం పేర్లతో లక్షలాది మందిని తమ బాధితులుగా మార్చుకుంటోంది. ఇక మన దేశంలోనూ తగ్గినట్లే తగ్గి మళ్లీ పంజా విసురుతోందీ మహమ్మారి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న కరోనా కేసులే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఇదే సమయంలో కొత్త కేసుల కంటే రికవరీలు తగ్గుతుండడం.. కరోనా ఇంకా మన మధ్యనే ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో కొవిడ్‌ లేదనుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న వాళ్లందరినీ అలర్ట్‌ చేయడానికి తన కరోనా కథను పంచుకోవడానికి మన ముందుకొచ్చింది దిల్లీకి చెందిన ఓ మహిళ. వ్యాక్సిన్‌ వచ్చినా అది మన దాకా రావడానికి సమయం పడుతుంది కాబట్టి అప్పటిదాకానైనా కనీస జాగ్రత్తలు పాటించాలంటూ అందరినీ వేడుకుంటూ తన కొవిడ్‌ అనుభవాలను ఇలా నెమరువేసుకుంది.

Know More

women icon @teamvasundhara

మేం కరోనా టీకా తీసుకున్నాం! మీరూ తీసుకోండి!

కాలయముడిలా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది కరోనా. సామాన్యులు, సంపన్నులు, సెలబ్రిటీలనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో వేల ప్రాణాలను బలిగొన్న ఈ ప్రమాదకర వైరస్‌కు విరుగుడు ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే కొవిడ్‌ రక్కసిని కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మన దేశంలోనూ టీకా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్‌పై అపోహలు, అనుమానాలు ఉన్నాయంటూ చాలామంది టీకా తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్‌పై భయాన్ని పటాపంచలు చేస్తూ మెగా కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి కొణిదెల ఉపాసన తాజాగా టీకా తీసుకుంది.

Know More

women icon @teamvasundhara

ఆ కరోనా వ్యాక్సిన్‌ వెనక ఉన్న దంపతులు వీరే!

కంటికి కనిపించకుండానే మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోంది కరోనా. మధ్యలో కొంచెం కనికరించినా మళ్లీ సెకండ్‌ వేవ్‌ అంటూ పలు ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ సమయంలో ఈ వైరస్‌ నుంచి మానవ జాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్నారు. ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు ప్రయోగాల్లో ఉండగా ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. దీంతో అందరిలో ఆశలు రేకెత్తిస్తోందీ వ్యాక్సిన్. అయితే ఈ టీకా తయారీ వెనక ఓ జంట అలుపెరగని కృషి ఉంది.

Know More

women icon @teamvasundhara

ఆ అనుభవమే నన్ను ఈ టీకా తయారీలో భాగం చేసింది!

కంటికి కనిపించకుండానే మానవాళి మనుగడకు సవాల్‌ విసురుతోంది కరోనా వైరస్‌. ఇప్పటికే లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి ధాటికి అందరూ తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ఇదే సమయంలో ఈ వైరస్‌ నుంచి మానవజాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్ర్తవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం కంటిమీద కునుకులేకుండా శ్రమిస్తున్నారు. ఈక్రమంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ సైంటిస్టుల బృందం ఎన్నో పరిశోధనలు చేసి ఓ టీకాను కనిపెట్టింది. కరోనా కట్టడికి సంబంధించి ఆశలు రేకెత్తిస్తోన్న ఈ టీకా తయారీ బృందంలో చంద్రా దత్తా అనే భారతీయ మహిళా శాస్ర్తవేత్త కూడా పాలుపంచుకోవడం విశేషం. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న ఈ కోల్‌కతా సైంటిస్టు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

కరోనా రోగుల కోసం తన ప్లాస్మాను దానం చేసింది!

కరోనా ప్రకోపానికి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌, రష్యా, ఇటలీ తదితర అగ్రదేశాలు కూడా ఈ మహమ్మారిని ఎదుర్కోలేకపోతున్నాయి. కంటికి కనిపించని ఈ వైరస్‌ కారణంగా మనుషులందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అని రోజులు గడుపుతున్నారు. ఈక్రమంలో ఈ మహమ్మారి నుంచి మానవజాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్ర్తవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్‌ కట్టడికి ఆశాకిరణంలా కనిపిస్తోంది ప్లాస్మా థెరపీ. ప్రధానంగా కరోనా వైరస్‌తో ఆరోగ్యం విషమించిన వారికి ప్రాణదాతలా పనిచేస్తోందీ చికిత్స విధానం. ఇలా ఇటీవలే కరోనా మహమ్మారిని జయించి తన ప్లాస్మాను దానం చేసి.. దేశంలోనే తొలి కరోనా ప్లాస్మా దాతగా గుర్తింపు తెచ్చుకుంది అహ్మదాబాద్‌కు చెందిన స్మృతీ థక్కర్‌. మరి, ఇంతకీ అసలేంటీ ప్లాస్మా థెరపీ? దీనిపై తొలి ప్లాస్మా డోనర్‌ స్మృతీ థక్కర్ అనుభవాలేంటి? తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఇలా కరోనాపై పోరాడుతున్నందుకు తృప్తిగా ఉంది!

ఓ సూక్ష్మక్రిమి(కరోనా)కి.. 190కి పైగా దేశాలకు మధ్య సాగుతోన్న సమరంలో మనుషులంతా ఏకమై కంటికి కనిపించని శత్రువుతో.. బయటకు కనబడని యుద్ధం చేస్తున్నారు. ఈ వైరస్‌ ధాటికి మనుషులందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అని రోజులు గడుపుతున్నారు. ఈ క్రమంలో కొవిడ్‌ 19 వైరస్‌ నుంచి మానవజాతిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు నిరంతరంగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వ్యాక్సిన్‌ తయారీలో అలుపూ-సొలుపూ లేకుండా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం కొవిడ్‌ 19పై ఎన్నో అధ్యయనాలు చేసి ‘ChAdOx1 nCoV-19’ అనే టీకాను కనిపెట్టింది. అయితే ఈ టీకాను ముందు మనుషులపై ప్రయోగించాలని వీళ్లు నిర్ణయించారు. ఈ క్రమంలో తమపై ఈ పరీక్షలు జరిపేందుకు అంగీకరిస్తూ 800 మంది వలంటీర్లు ముందుకు రాగా.. వారిలో ఎలీసా గ్రనాటో అనే మహిళ టీకా తీసుకోవడం విశేషం.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala