ఇలా చేస్తే అన్నింటా మనమే రాణులం!
‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ ఏళ్లు గడుస్తోన్నా ఇది మాటలకే పరిమితమవుతోంది తప్ప చేతల్లో మాత్రం సాధ్యం కావట్లేదు. లింగ అసమానత, లైంగిక వేధింపులు, వివక్షాపూరిత ధోరణి, ప్రోత్సాహం కొరవడడం.. వంటివి ప్రతి చోటా మహిళల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. అయినప్పటికీ ప్రతి రంగంలో ఎదురవుతోన్న ఇలాంటి అడ్డంకుల్ని తొలగించుకుంటూ అడుగు ముందుకేయడానికే మొగ్గు చూపుతున్నారు ఈ తరం అతివలు. ఇలా తమ విజయంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అయితే ఆయా రంగాల్లో మహిళలకు కొన్ని విషయాల్లో చేయూతనందిస్తే చాలు.. వారు ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని స్త్రీ-పురుష సమానత్వ ప్రపంచంగా మార్చగలరని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. అది వారికి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదిగే సదవకాశాన్ని సైతం అందిస్తుందని చెబుతున్నారు. మరి, ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని ప్రస్తుతం ఆయా రంగాల్లో మహిళల పాత్ర ఎలా ఉంది? పురుషులకు దీటుగా రాణించాలంటే ఏయే అంశాల్లో వారికి ప్రోత్సాహం అందించాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి..
Know More