నా పొగరు, ధైర్యం.. అన్నీ అమ్మ నుంచే వచ్చుంటాయి!
అందం, అణకువ, వాక్చాతుర్యం.. ఇలా ఒక వ్యాఖ్యాతకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుంది అందాల యాంకర్ అనసూయ. ‘జబర్దస్త్’తో బుల్లితెరపై సందడి చేస్తూ ప్రతి ఇంట్లో ఆడపడుచులా మారిపోయిందీ ముద్దుగుమ్మ. తన చలాకీ మాటలతో, చిరునవ్వుతో అందరినీ పలకరించే అను.. ‘రంగమ్మత్త’గా సినీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని, అమ్మ వల్లే ఇప్పుడిలా ఉన్నానంటోంది. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మనకు తెలియని బోలెడన్ని విషయాలు పంచుకుందీ బుల్లితెర బ్యూటీ.
Know More