మాది ఫ్రెండ్లీ రిలేషన్షిప్.. ఇలా సరదాగా గడిపేస్తాం!
అసలు సిసలైన దాంపత్య బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంటారు లవ్లీ కపుల్ విరాట్ కోహ్లీ - అనుష్కా శర్మ. కెరీర్ పరంగా ఇద్దరి దారులు వేరైనా.. ఒకరి వృత్తిని మరొకరు గౌరవించుకుంటూ ఇద్దరూ అన్యోన్యత అనే దారిలోనే ముందుకు సాగుతున్నారు.. కాబట్టే తమ అనుబంధంలోని మధురిమల్ని నిత్యనూతనం చేసుకుంటూ ఫ్యాన్స్‌కు దాంపత్య బంధంలోని పాఠాలు నేర్పుతున్నారు. దంపతులిద్దరూ ఎంత ఫ్రెండ్లీగా ఉంటే వారి మధ్య అనుబంధం అంత దృఢమవుతుందని ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపించిన ఈ ముద్దుల జంట.. తాజాగా మరోసారి అలాంటి సందేశాన్నే ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగానూ ఒకరి గురించి ఒకరికి ఎంత అవగాహన ఉందన్న విషయంపై వీరిద్దరూ కలిసి చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి, ఈ ఫన్ క్విజ్‌లో ఎవరు గెలిచారో? రండి.. చూద్దాం..!
Know More