నా గూట్లో నేనెంతో సంతోషంగా ఉన్నా..!
టాలీవుడ్ సెలబ్రిటీ జంట ‘వరుణ్ సందేశ్- వితికా షేరు’ ఈ ఏడాది తమ సంక్రాంతి పండగను ఎంతో సంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ కలిసి గడిపిన మధుర క్షణాలను ఫొటోల్లో బంధించి, వాటిని తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది వితిక. పండగ సందర్భంగా ఇద్దరూ ట్రెడిషనల్ దుస్తుల్లో ముస్తాబై, పల్లెటూరి వాతావరణంలో క్లిక్‌మనిపించిన ఈ ఫొటోల్లో చూడముచ్చటగా ఉన్నారీ లవ్లీ కపుల్. ఈ ఫొటోల్లోంచి ఓ అందమైన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘నేనూ, మా ఆయన గారు..’ అంటూ సరదాగా రాసుకొచ్చిందీ బిగ్‌బాస్ బ్యూటీ.
Know More