ఈ చిట్కాలతో మీ శరీరాన్ని డీటాక్స్ చేసుకోండి!
ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలంటే నోరూరించే విభిన్న వంటకాలతో కూడిన విందులే గుర్తొస్తాయి. తలచుకుంటేనే నోరూరిపోతోంది కదూ! అయితే ఇలాంటి విందు భోజనం ఆరంగించేటప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అమితంగా లాగిస్తే మాత్రం అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఏదేమైనా ఇలాంటి ప్రత్యేక వంటకాల ద్వారా ఎంతో కొంత మొత్తంలో కొవ్వులు, చక్కెరలు, శీతల పానీయాలు.. వంటివి మన శరీరంలోకి చేరిపోతాయి. నిజానికి ఇవి మన శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి. కాబట్టి మన శరీరంలో చేరిన ఇలాంటి విషతుల్యాలను తొలగించుకొని తిరిగి సాధారణ ఆహార నియమాలకు అలవాటు పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’.
Know More