ఇంటి నుంచి పనిచేసినా ప్రొఫెషనల్‌గా తయారవ్వాల్సిందే!
లాక్డౌన్ పుణ్యమాని అప్పటిదాకా అలవాటు లేని కంపెనీలు సైతం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ని అలవాటు చేసుకున్నాయి. దీంతో ఇంటి నుంచే ఉద్యోగులు సౌకర్యవంతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే పని చేయడం కదా అని చాలామంది బద్ధకిస్తూ ఆలస్యంగా నిద్ర లేవడం, లాగిన్ అవ్వాల్సిన టైమ్ దాటిపోతుందని గబగబా బ్రష్ చేసుకొని ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం, కొంతమందైతే ఏదో ఒకటిలే అన్నట్లు ఇంట్లో వేసుకునే నైట్ సూట్స్ ధరించి పని మొదలుపెట్టేయడం.. వంటివి చేస్తుంటారు. అయితే నీట్‌గా డ్రస్ వేసుకోకపోయినా పనిపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు ఆర్గనైజేషనల్ నిపుణులు. మనం ఎలాగైతే ఆఫీసుకెళ్లేటప్పుడు ప్రొఫెషనల్‌గా తయారవుతామో.. ఇంటి నుంచి పనిచేసినా అలాగే తయారవ్వాలంటున్నారు వారు. తద్వారా ఇంటి నుంచి పనిచేసినా నీరసించిపోకుండా.. మన పూర్తి దృష్టంతా పనిపైనే నిలిపి మంచి అవుట్‌పుట్ అందించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఇంటి నుంచి పనిచేసినా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఎలా తయారుకావాలి? ఫలితంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? తెలుసుకుందాం రండి..
Know More