కరోనా లక్షణాలతో బాధపడ్డా.. అయినా కోలుకున్నా!
కరోనా ప్రభావంతో అగ్రదేశమైన బ్రిటన్ కూడా అతలాకుతలమవుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆరోగ్య శాఖ మంత్రి, ప్రిన్స్ చార్లెస్ తదితర ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడడం గమనార్హం. చిన్నా, పెద్ద, పేద, ధనిక, సామాన్యుడు, సెలబ్రిటీ అన్న తేడాల్లేకుండా అందరినీ కబళిస్తోన్న వైరస్ కారణంగా బ్రిటన్లో సుమారు 5వేలమందికి పైగా మరణించారు. ఈక్రమంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రి, హ్యారీ పోటర్తో సరికొత్త మాయాలోకాన్ని సృష్టించిన జేకే రౌలింగ్ తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడ్డానని ప్రకటించింది. అయితే వైద్యుడైన తన భర్త సూచించిన కొన్ని సలహాలను పాటించడంతో ఎటువంటి పరీక్షలు, చికిత్స చేయించుకోకుండానే ఈ మహమ్మారి నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చారామె. మరి ఆమె పాటించిన ఆ సలహాలేంటో మనమూ తెలుసుకుందాం రండి.
Know More