వినాయకుడికీ ఇమ్యూనిటీని పెంచే నైవేద్యాలు!
పండగంటేనే బోలెడన్ని పిండి వంటలు, నైవేద్యాలు. వాటిని తయారుచేసి దేవుడికి ఎప్పుడెప్పుడు నైవేద్యం పెడతామా.. మనమెప్పుడు లాగించే స్తామా అని ఎదురుచూస్తుంటాం. అలాంటి పిండి వంటల హడావిడి ‘వినాయక చవితి’తో మళ్లీ మొదలైంది. అయితే ఈ పండక్కి ఎప్పుడూ విభిన్న స్వీట్లు, మోదక్, ఉండ్రాళ్లు.. వంటివన్నీ తయారుచేసి ఆ బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకుంటుంటాం. అయితే ఈసారి కరోనా ప్రతికూల పరిస్థితులున్న నేపథ్యంలో చవితి నైవేద్యాల్లో కూడా రోగనిరోధక శక్తిని పెంచే వంటకాలకు ప్రాధాన్యమివ్వడం మంచిది. తద్వారా మనం కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడడంతో పాటు ఆ పార్వతీ తనయుడి ఆశీస్సులు కూడా అందుకోవచ్చు. మరి, రోగనిరోధక శక్తిని పెంచే ఆ పిండి వంటలేంటో, వాటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం రండి..
Know More