58 నిమిషాల్లో 46 వంటకాలు... అదే ఈ కుకింగ్ క్వీన్ రహస్యం!
సాధారణంగా చిన్నారులంటే చదువు, ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు. కరోనా కారణంగా గత ఏడెనిమిది నెలలుగా ఇంటికే పరిమితమైన పిల్లలు అమ్మ వండి పెట్టింది తింటూ... ఫోన్, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇక ఆన్లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో కొద్ది సేపు పాఠాలు వింటూ, మరికొద్ది సేపు ఆటలతో కాలం గడిపేస్తున్నారు. అయితే లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చెన్నైకి చెందిన ఓ చిన్నారి వంటగదిలో గరిటె తిప్పడం ప్రారంభించింది. అమ్మ సహాయంతో మెరుపు వేగంతో రుచికరమైన వంటకాలు చేయడం నేర్చుకుంది. ఈక్రమంలో ఏకంగా ‘యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. మరి తన పాకశాస్ర్త ప్రావీణ్యంతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఆ కుకింగ్ గర్ల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి..
Know More