మా పని పూర్తయింది.. మరి, మీరు రడీనా?!
‘వృక్షో రక్షతి రక్షితః..’ స్ఫూర్తితో ప్రారంభమైన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వెల్లువలా సాగుతోంది. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మొక్కలు పెంచడమే మార్గమని పలువురు సెలబ్రిటీలు ఈ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. పర్యావరణంపై ప్రజల్లో సైతం చైతన్యం పెంచేలా మొక్కలు నాటుతూ స్ఫూర్తినిస్తున్నారు. తాజాగా రాఖీఖన్నా, మంచులక్ష్మి ఈ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను పూర్తిచేశారు. తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
Know More