సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఈ బీచ్‌ వర్కవుట్‌కు బాగా అలవాటు పడిపోయాను!

‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయానికి తోడు తనకు మాత్రమే సాధ్యమయ్యే క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అనతి కాలంలోనే అశేష అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోను చురుగ్గా ఉండే ఈ కన్నడ బ్యూటీ...తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన బీచ్‌ వర్కవుట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందరితో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ వీడియోలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Know More

women icon @teamvasundhara

చర్మ సంరక్షణ కోసం నేను ఈ చిట్కాలు పాటిస్తున్నా!

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని సినీతారలు అనుకోవడం సహజం. ఈ నేపథ్యంలో సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో అందంగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మన ముద్దుగుమ్మలు. ప్రత్యేకించి చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో లభించే సహజసిద్ధమైన చిట్కాల్ని పాటించడమే కాకుండా.. తమ శరీరతత్వానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. ఎంత రుచిగా ఉన్నా సరే.. శరీరానికి అలర్జీ కలిగించే ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. ఈ క్రమంలో తాను కూడా గతంలో ఫుడ్‌ అలర్జీతో బాధ పడ్డానంటోంది రష్మిక మందన. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన స్కిన్‌ కేర్‌ టిప్స్‌ని అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara

అలా అయితే జీవితాంతం క్వారంటైన్‌లో ఉండేదాన్నేమో!

‘చూసీ చూడంగానే నచ్చేశావే’ అంటూ తొలి సినిమాతోనే టాలీవుడ్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రష్మిక మందన. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యేలా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అశేష అభిమానులను సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ఇటీవలే ‘భీష్మ’ సినిమాలో నితిన్‌ సరసన ‘వాట్‌ ఏ బ్యూటీ’ అనిపించుకున్న ఈ కన్నడ బేబ్‌.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఎంతో క్యూట్‌గా, సరదాగా సమాధానమిచ్చింది. మరి, ఆ విశేషాలేంటో మనమూ చూద్దామా!

Know More

women icon @teamvasundhara

మీ జీవితానికి మీరే డ్రైవర్‌లా ఉండండి..!

‘కిరిక్‌ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది నటి రష్మిక మందన. ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ కన్నడ భామ తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘గీత గోవిందం’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరింది. అనంతరం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాన్ని దక్కించుకొని లక్కీ హీరోయిన్‌గా మారిపోయిందీ ముద్దుగుమ్మ. ‘గీత గోవిందం’లో ‘గీత’గా అలరించినా... ‘డియర్‌ కామ్రేడ్‌’లో ‘లిల్లీ’గా భావోద్వేగాలు పలకరించినా.. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ‘సంస్కృతి’గా అల్లరి చేసినా.. అది రష్మికకే చెల్లింది. సినిమా.. సినిమాకు తనలోని వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా ‘భీష్మ’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించి.. తనదైన అందం, అభినయం, హావభావాలతో ఆకట్టుకుంది. సినిమాలతో బిజీగా ఉండే రష్మిక అదే సమయంలో సోషల్‌మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఆసక్తికరమైన పోస్టులపై ఓ లుక్కేద్దామా..?

Know More

women icon @teamvasundhara

నాకింకా కొత్తగానే ఉంది..!

డబ్‌స్మాష్‌లతో మొదలై షార్ట్‌ ఫిలిమ్స్‌తో నెటిజన్లకు పరిచయమైంది దీప్తి సునైనా. ఆ తర్వాత ‘బిగ్‌బాస్‌’ సీజన్‌2తో బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరైందీ అందాల తార. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనదైన అల్లరి పనులతో అందరినీ ఆకట్టుకున్న దీప్తి ప్రస్తుతం పలు లఘు చిత్రాల్లో నటిస్తోంది. ఇక సోషల్‌ మీడియాలోఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలను షేర్‌ చేసుకోవడం ఈ అమ్మడికి అలవాటు. ఈక్రమంలో తాజాగా పసుపు రంగు చీరలో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన కూర్చున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నేను ఎప్పటికీ కోల్పోని... తిరిగి పొందాలనుకునే వ్యక్తి.. నేనే!’ అని ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ షార్ట్‌ ఫిలిం క్వీన్‌.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala