మన సుమక్క ఫ్యాషన్స్ ‘కెవ్వు కేక’!
అది టీవీ కార్యక్రమమైనా, ఆడియో ఫంక్షనైనా, ప్రి-రిలీజ్ ఈవెంట్ అయినా.. స్టేజీపై ఆమె సందడి చేయాల్సిందే! టీవీలో తన కార్యక్రమం వస్తోందంటే చాలు.. ఇంట్లోని ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ టీవీ ముందుకు చేరాల్సిందే! సమయస్ఫూర్తికి హాస్యాన్ని జోడిస్తూ తను విసిరే పంచ్‌లు, ఛలోక్తులకు ఎవరి మోములోనైనా నవ్వుల పువ్వులు విరబూయాల్సిందే! అలుపెరుగని మాటల ప్రవాహానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఆమె ఎక్కడుంటే అక్కడ మాటల పరవళ్లే. ఆ మాటల మాంత్రికురాలు మరెవరో కాదు.. మనందరం ‘సుమక్క’ అంటూ ఎంతో ప్రేమగా పిలిచే సుమ కనకాల.
Know More