90 ఏళ్ల వయసులోనూ ల్యాప్‌టాప్‌లో వార్తలు చదివేస్తోంది!
కరోనా నేపథ్యంలో చాలామంది స్మార్ట్ ఫోన్ లకు ఎక్కువగా అలవాటు పడ్డారు. ప్రత్యేకించి యువత, మధ్య వయస్కులు వారికి టెక్నాలజీ తెలుసు కాబట్టి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ మొదలైన గ్యాడ్జెట్ లను సులభంగా వినియోగించగలుగుతారు. మరి ౭౦-౮౦ ఏళ్లు పైబడిన వారి సంగతేంటి? ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని వారికి మాత్రం ఉండదా? ఇదే విషయాన్ని ఆలోచించింది కేరళకు చెందిన ఓ వృద్ధురాలు. అందుకే 90 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆసక్తి, ఉత్సాహంతో ల్యాప్‌టాప్ ఆపరేట్ చేయడం నేర్చుకుంది. తద్వారా ఎవరి సహాయం లేకుండానే ఆన్లైన్లో వివిధ దినపత్రికలు చదవడం, ఇతర అంశాల పైన అవగాహన పెంచుకోవడం చేస్తోంది ఈ గ్రేట్ గ్రాండ్మా.
Know More