40ల్లోకి ప్రవేశించారా?ఈ ఆహారంతో ఇమ్యూనిటీని పెంచుకోండి!
మెనోపాజ్ వల్ల కావచ్చు.. జీవనశైలిలో మార్పుల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా నలభైల్లోకి అడుగుపెట్టిన మహిళలు వయసుతో పాటు ఉన్నట్లుండి బరువు పెరుగుతుంటారు. ఈ క్రమంలో పెరిగిన బరువును తగ్గించుకోవడానికి శరీరం సహకరించదని అనుకునే వారూ లేకపోలేదు. ఇలా శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, చక్కటి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఈ వయసులో వివిధ అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి, వీటి బారిన పడకూడదన్నా, పడినా వీటిని సమర్థంగా ఎదుర్కోవాలన్నా రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండడం ముఖ్యం. అందుకోసం కొన్ని ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. మరి, నలభైల్లో ప్రవేశించిన మహిళల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆ ఆహార నియమాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More