ఒకప్పుడు నాన్‌వెజ్ కి బానిసయ్యా.. ఇప్పుడు శాకాహారిగా మారిపోయా!
చికెన్, మటన్, చేపలు.. వీటి పేర్లు చెబుతుంటూనే మాంసాహార వంటకాలు గుర్తొచ్చి నోరూరిపోతుంది కదూ! మరి, నాన్‌వెజ్ వంటకాలంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అయితే కొందరు మూగ జీవాల పట్ల ప్రేమ, ప్రకృతి పరిరక్షణలో భాగంగా తమ ఆహారపుటలవాట్లను మార్చుకుంటారు. మాంసాహారం పూర్తిగా మానేసి శాకాహారాన్ని తమ జీవనవిధానంలో ఓ భాగం చేసుకుంటారు. కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలూ ఇందుకు అతీతం కాదు. ఆ లిస్టులో తాజాగా చేరిపోయింది బాలీవుడ్ ఫిట్టెస్ట్ బ్యూటీ శిల్పా శెట్టి. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై మక్కువ చూపే ఈ అందాల తార.. ఇప్పుడు పూర్తి వెజిటేరియన్‌గా మారిపోయింది. దీన్ని ఓ మైలురాయిగా అభివర్ణిస్తూ.. అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశానని, ఎన్నో ఏళ్ల కల సాకారమైందంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. అంతేకాదు.. శాకాహారాన్ని తన సంపూర్ణ ఆహారంగా మలచుకున్న ఈ యమ్మీ మమ్మీ.. దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఆ పోస్ట్‌లో భాగంగా వివరించింది.
Know More