ఈ మహమ్మారిని జయించాలంటే మాస్క్ మరిచిపోవద్దు!
మాస్క్, స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం... కరోనాను సాధ్యమైనంతవరకు కట్టడి చేయాలంటే ఈ మూడింటినీ మన జీవన విధానంలో భాగం చేసుకోవాల్సిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే చాలామంది ఈ జాగ్రత్తలను పాటిస్తున్నారు. అయితే ‘మనకేం కాదులే’ అనుకుంటూ కొద్దిమంది ఈ జాగ్రత్తలు పాటించడంలో తీవ్ర అలసత్వం వహిస్తున్నారు. ఈక్రమంలో ఈ చిన్న పాటి అజాగ్రత్తలే అందరినీ సమస్యల్లోకి నెడుతున్నాయని హెచ్చరిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా ఒక యానిమేటెడ్ వీడియోను విడుదల చేసింది.
Know More