పిరియడ్స్లో.. ఇటు బ్లీడింగ్, అటు పీపీఈ కిట్లు.. మా బాధ వర్ణనాతీతం!
గత కొన్ని నెలలుగా కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్నారు వైద్యులు, నర్సులు. కొవిడ్ రోగులకు సేవలందించే క్రమంలో శారీరకంగా, మానసికంగా వారు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఇక దీనికి తోడు నిరంతరాయంగా వారు ధరించే పీపీఈ కిట్లు వారికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మహిళా వైద్య సిబ్బందిని మరో సమస్య వేధిస్తోంది. అదే నెలసరి. దానికి వేళాపాళా ఉండదు.. సమయం, సందర్భంతో పనిలేదు. కొవిడ్ రోగులకు సేవలందించే మహిళా వైద్య సిబ్బందైనా, సాధారణ మహిళలైనా.. ఎప్పుడైనా, ఎక్కడున్నా నెలనెలా ఈ అనుభవం ఎదుర్కోవాల్సిందే!
Know More