అదంటే ఎక్కువ ఇష్టం.. ఆ విషయం షాహిద్‌కి కూడా తెలుసు!
మీరా రాజ్‌పుత్.. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సతీమణి అయిన ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో ఆమెను 2.5 మిలియన్ల మంది అనుసరిస్తున్నారంటే ఆమెకున్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లోనే ఉంటుందీ బ్యూటిఫుల్ మామ్. తన గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవడంతో పాటు...వీలు చిక్కినప్పుడల్లా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూనే ఉంటుంది. అలా తాజాగా తన అభిమానులతో ‘దిస్ ఆర్ దట్’ సెషన్‌ను నిర్వహించింది మీరా. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విశేషాలు, అభిరుచులు, షాహిద్‌తో తనకున్న అనుబంధం గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంది. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...
Know More