సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

కరోనా అలర్ట్‌: బ్యూటీ పార్లర్‌కి వెళ్తున్నారా? అయితే ఇవి పాటించాల్సిందే!

రూప ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. అందాన్ని సంరక్షించుకోవడంలో భాగంగా రెండువారాలకోసారైనా ఫేషియల్‌ చేయించుకోవడం ఆమెకు అలవాటు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలల నుంచి పార్లర్లన్నీ మూతపడడంతో సౌందర్య నిపుణుల సలహా మేరకు ఇంట్లోనే స్వయంగా ఫేషియల్‌ చేసుకుంటోంది. గీతకు అవాంఛిత రోమాల సమస్య ఎక్కువ. వీటిని తొలగించుకోవడానికి పార్లర్‌ను ఆశ్రయిస్తుంటుందామె. అయితే పార్లర్లన్నీ గత రెండు నెలలుగా మూసే ఉండడంతో ఇంట్లోనే వ్యాక్సింగ్‌ చేసుకుంటోంది. అది సరిగ్గా వర్కవుట్‌ కాకపోవడంతో ఎప్పుడెప్పుడు పార్లర్లు తెరుస్తారా అని మొన్నటిదాకా ఎదురుచూసింది. వీళ్లే కాదు.. చాలామంది అమ్మాయిలు, మహిళలు తమ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ కోసం బ్యూటీ పార్లర్లను, స్పా సెంటర్లను ఆశ్రయించడం సహజమే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా మూత పడిన సెలూన్లన్నీ లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో పార్లర్స్‌కి వెళ్లి అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

Know More

women icon @teamvasundhara

ఇలా స్టైలిష్‌గా ‘మాస్క్‌’ చుట్టేద్దాం !

ప్రత్యేక సందర్భం ఉన్నా, లేకపోయినా అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలోనే వేసుకునే డ్రస్‌ దగ్గర్నుంచి పెట్టుకునే యాక్సెసరీస్‌ వరకు అన్నీ మ్యాచింగ్‌గా, అందరికంటే విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి ఫ్యాషన్‌ ప్రియుల మనసెరిగి డిజైనర్లు కూడా సరికొత్త ఫ్యాషన్స్‌ని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో మన లైఫ్‌స్టైల్లో భాగమైన మాస్కుల్లోనూ సరికొత్త ఫ్యాషన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరి, ఇటు వైరస్‌ నుంచి మనకు రక్షణగా, అటు ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేసే అలాంటి కొన్ని డిఫరెంట్‌ ఫేస్‌ మాస్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon @teamvasundhara

ఈ అనుభూతిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..!

ప్రపంచ దేశాలకు.. కంటికి కనిపించని సూక్ష్మక్రిమికి మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కరోనా భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుంటే.. అత్యవసర విభాగాలకు చెందిన వైద్యులు, పోలీసు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రం నిర్విరామంగా తమ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు వాళ్లు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం వాళ్లు పడుతోన్న శ్రమను గుర్తించి ఎంతోమంది వివిధ వేదికల ద్వారా వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా కూడా పోలీసు అధికారులకు తనదైన స్టైల్‌లో కృతజ్ఞతలు తెలిపింది.

Know More

women icon @teamvasundhara

అందుకే మాస్కులు తయారుచేసి చెట్టుకు వేలాడదీస్తోంది!

కరోనా ధాటికి మానవజాతి విలవిల్లాడిపోతోంది. ప్రపంచమంతా ఒక్కటై ఈ మహమ్మారిపై పోరాటం సాగిస్తోంది. ముఖ్యంగా వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తదితర అత్యవసర విభాగాలకు చెందిన సిబ్బంది కంటి మీద కునుకులేకుండా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే వీళ్లతో పాటు సామాజిక స్పృహ కలిగిన కొందరు సామాన్యులు కూడా ఈ ఆపద సమయంలో తమ వంతు సహాయాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈక్రమంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానంగా అత్యవసరమైన ఫేస్‌ మాస్కులను స్వయంగా రూపొందిస్తున్నారు. ఈ కోవకే చెందుతుంది అమెరికాకు చెందిన డెబ్‌ సిగ్గిన్స్‌. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భారీగా మాస్కులు తయారుచేస్తున్న ఆమె భౌతిక దూరం పాటిస్తూనే ఓ వినూత్న పద్ధతిలో అవసరమైన వారందరికీ పంపిణీ చేస్తోంది. తద్వారా అందరి మన్ననలు అందుకుంటోంది.

Know More

women icon @teamvasundhara

మలి వయసులో ‘మాస్కో’త్సాహం!

సాధారణంగా వయసు పైబడుతున్న వారు విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ఇంకొందరు వారి ఇంట్లో ఉన్న మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఒంట్లో సత్తువ తగ్గి పోయిన వారు చిన్న చిన్న పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే కరోనా తెచ్చిన ఆపత్కాలంలో కొందరు వృద్ధులు మాత్రం అలుపన్నది లేకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. ముఖ్యంగా నేడు ప్రతి ఒక్కరికీ అవసరమైన మాస్కులు తయారుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు బామ్మలు. మరి ముదిమి మీద పడ్డా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తోన్న అలాంటి కొందరు వృద్ధుల గురించి తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

ఈ ప్యాడ్‌వుమన్‌ ఇప్పుడు మాస్కులు తయారుచేస్తోంది!

‘మన ఆశయం మంచిదైతే ఆ దేవుడు కూడా మనకు అండగా ఉంటాడం’టారు. ముంబైకి చెందిన సుహానీ మోహన్‌ను చూస్తే ఈ మాటలు నిజమనిపిస్తాయి. సామాజిక బాధ్యతతో శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేస్తోన్న ఆమె.. కరోనా విజృంభణతో సర్జికల్‌ ఫేస్‌ మాస్కుల తయారీకి నడుం బిగించింది. డిజైన్లు కూడా సిద్ధం చేసుకుంది. అంతా సవ్యంగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో లాక్‌డౌన్‌ రూపంలో ఆమెకు అనుకోని అవాంతరం ఎదురైంది. మాస్కుల తయారీ, విక్రయాల్లో కీలకపాత్ర పోషించే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వాటి ఉత్పత్తి ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎంతో ఉన్నతాశయంతో సుహానీ ప్రారంభించిన పనికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆపన్నహస్తం అందించారు. ఇంకేముంది.. ఆమె అనుకున్న లక్ష్యం మళ్లీ పట్టాలెక్కింది. మరి తన ప్రతిభాపాటవాలతో ఆనంద్‌ మహీంద్రా లాంటి బిజినెస్‌ టైకూన్‌ మెప్పు పొందిన ఈ యువ వ్యాపారవేత్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon @teamvasundhara

మాస్కులు ధరించే విషయంలో ఈ జాగ్రత్తలు మరవద్దు!

కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో భాగంగా స్వీయ పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కుల వినియోగం కూడా తప్పనిసరైంది. అయితే ఇదే క్రమంలో గంటల తరబడి మాస్కులను ధరించడం వల్ల చర్మంపై గాట్లు ఏర్పడడం, కమిలిపోవడం, ఆ ప్రదేశంలో గాలి ప్రసరణ సరిగ్గా జరగక ఎరుపెక్కడం, అలర్జీలా రావడం.. వంటి పలు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలా నిరంతరాయంగా మాస్కులు ధరించడం వల్ల కొందరు నర్సుల చర్మంపై అయిన గాయాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలైన విషయం మనం చూసే ఉంటాం. అలాగని అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించకుండా ఉండే పరిస్థితి ఇప్పుడు లేదు.. కాబట్టి మాస్కులు ఎక్కువగా వినియోగించే వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మాస్కులు ఎక్కువగా వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయి? రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

వాళ్లు అక్కడ .. వీళ్లు ఇక్కడ.. సమాజ సేవలో..!

కరోనా.. ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచాన్ని ఏకం చేసింది.. ఈ కష్ట సమయంలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచేలా చేసింది. అదెంతలా అంటే.. చిన్నారులు తమ పిగ్గీ బ్యాంకులను పగలగొట్టి ప్రభుత్వ సహాయ నిధులకు విరాళమిచ్చేంతగా! పేదవారు కూడా తమకున్న దాంట్లో ఇతరులకు పంచి పెట్టేంతగా..! ఇక కరోనాపై పోరులో భాగంగా వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేసే సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాత్రనక, పగలనక కరోనా బాధితులకు సేవలందిస్తూ తమ వృత్తిధర్మాన్ని చాటుకుంటున్న వారు ఎందరో! అయితే ఈ క్రమంలో వారు తమ రక్షణ కోసం పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌) సూట్స్‌, మాస్కులు, గ్లౌజులు.. వంటివి ధరించడం తప్పనిసరి. కానీ ప్రస్తుతం దేశంలో వాటి కొరత ఏర్పడిన నేపథ్యంలో వాటిని ఉత్పత్తి చేసే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల భార్యలు. బెంగళూరులోని సీఆర్‌పీఎఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సెంటర్‌లో కుట్టు పనిలో నిమగ్నమైన వీరు అటు సామాజిక దూరం పాటిస్తూనే, ఇటు కొవిడ్‌ కిట్స్‌ని తయారుచేస్తున్నారు.

Know More

women icon @teamvasundhara

కరోనాపై పోరులో మేము సైతం!

కరోనా ధాటికి మానవజాతి విలవిల్లాడిపోతోన్న నేపథ్యంలో.. ప్రపంచమంతా ఒక్కటై ఈ మహమ్మారిపై పోరాటం సాగిస్తోంది. మన దేశంలో కూడా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా, పోలీస్‌.. తదితర అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీళ్లతో పాటు సామాజిక స్పృహ కలిగిన మరికొందరు సైతం ఈ ఆపద సమయంలో సమాజానికి తమ వంతు సహాయాన్ని అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తు్న్నారు. ఈ క్రమంలో కొంతమంది కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రాథమికంగా ఉపయోగించే మాస్కులను స్వయంగా రూపొందిస్తున్నారు. ఇలాంటి కొంతమంది మహిళామణుల గురించి తెలుసుకుందాం రండి..!

Know More

women icon @teamvasundhara

వారి కోసమే.. నోరు కనిపించే ఈ ప్రత్యేక మాస్కులు!

కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న అల్లకల్లోలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా కరోనాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఈ వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. ఇక ఎన్నడూ లేని విధంగా మాస్కుల వినియోగం బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ మాస్కుల్లోనూ ఎన్నో రకాలు మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే అవసరం నుంచే ఓ ఆలోచన పుడుతుందన్నట్లు సరికొత్త మాస్కుకు రూపకల్పన చేసింది అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ స్టూడెంట్‌. ఇంతకీ ఆమె రూపొందించిన ఈ మాస్కుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటనేగా మీ సందేహం? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే...!

Know More

women icon @teamvasundhara

ఆ మహిళల కృషితో అందుబాటు ధరల్లోనే మాస్కులు, శానిటైజర్లు!

ప్రపంచమంతా కరోనా వైరస్‌ అలుముకున్న ఈ తరుణంలో దాన్నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి, ఓవైపు మార్కెట్లో లభించే మాస్కులు కొందామంటే వందలకు వందలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. మరోవైపు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే శానిటైజర్ల కొరత కూడా ఏర్పడినట్లు మనం రోజూ వార్తల్లో వింటూనే ఉన్నాం. అయితే ఇక నుంచి మాస్కులు, శానిటైజర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందీ పడాల్సిన అవసరం లేదంటున్నారు మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లోని ఫూల్‌బాగ్‌కు చెందిన మహిళలు. ఈ క్రమంలోనే అక్కడి వందలాది మంది మహిళలు మాస్కులు, శానిటైజర్ల తయారీలో నిమగ్నమయ్యారు. ఇలా వీరు తయారుచేసిన ఈ ఉత్పత్తుల్ని తక్కువ ధరకే విక్రయిస్తూ కరోనా బారి నుంచి అందరినీ కాపాడడంలో పరోక్షంగా తమ వంతుగా కృషి చేస్తున్నారు. మరి, ఈ మహిళల గురించి, వారు తయారుచేస్తోన్న ఉత్పత్తుల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

ఈ ‘కరోనా’ కథలు విన్నారా..?

అమెరికా నుంచి హైదరాబాద్‌ వరకు ఇప్పుడు అందరినీ భయపెడుతోన్న అంశం ఏదైనా ఉందంటే అది కరోనా వైరసే (కొవిడ్‌-19) అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్థిక వ్యవస్థ నుంచి క్రీడలు, సినిమాలు.. ఇలా ప్రతి రంగంపై కరోనా ప్రభావం కనిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ఇప్పుడు ప్రపంచం మొత్తం శరవేగంగా వ్యాపిస్తోంది. భారత్‌లో ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 60దాటింది. మందులేని ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఈ క్రమంలో ఇప్పటికే ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ వైరస్‌ గురించి ప్రజల్లో అవగాహన పెంచే నేపథ్యంలో పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే కరోనా ఏ స్థాయిలో వ్యాపిస్తోందో.. ఆ వైరస్‌కు సంబంధించిన వార్తలు కూడా అదే స్థాయిలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న అలాంటి కొన్ని వార్తలపై ఓ లుక్కేద్దామా..?

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala