సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

బర్డ్‌ ఫ్లూ అలర్ట్‌ : చికెన్‌, కోడిగుడ్లు తినడం మంచిదా? కాదా?

వారాంతాల్లో మాంసాహారం, రోజుకో ఉడికించిన కోడిగుడ్డు.. ఇవి లేకుండా ఉండలేరు కొంతమంది. అది కూడా మాంసాహారుల్లో చికెన్‌ ప్రియులే ఎక్కువమంది! అయితే ప్రస్తుతం బర్డ్‌ ఫ్లూ భయంతో వీటిపై ఉన్న ఇష్టాన్ని చంపుకొని మరీ వీటికి దూరంగా ఉంటోన్న వారూ లేకపోలేదు. అయితే ఆ భయం అక్కర్లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వీటిని బాగా ఉడికించుకొని తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరగదని చెబుతోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. చికెన్‌, కోడిగుడ్లను తినాలా? వద్దా? ఒకవేళ తీసుకుంటే వైరస్ మూలంగా ఏవైనా అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుందా? ఇలా చాలామందిలో నెలకొన్న సందేహాలకు తెరదించుతూ తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. ఇందులో భాగంగా వీటిని కొనుగోలు చేయడం దగ్గర్నుంచి వండుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం.. తదితర అంశాల గురించి ఈ మార్గదర్శకాల్లో భాగంగా వివరించిందీ సంస్థ.

Know More

women icon @teamvasundhara

న్యూ ఇయర్.. ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకోవడమే మంచిదట!

వెకేషన్స్‌, ఫ్యామిలీ టూర్స్‌, డీజే హంగామా, పబ్బులు, పార్టీలు, డ్యాన్సులు.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో మనమంతా చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే ఇప్పటిదాకా చేసుకున్న న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఒకెత్తయితే.. ఈ ఏడాది మరో ఎత్తు! కారణం.. కరోనా మహమ్మారి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పబ్బులు, పార్టీలు, డీజేలు అంటే కాస్త ఆలోచించాల్సిందే! పైగా ఇప్పుడు కొత్త రకం కరోనా వైరస్‌ ఆనవాళ్లు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సర వేడుకలు సామూహికంగా చేసుకోవడం వల్ల వైరస్‌ విస్తృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Know More

women icon @teamvasundhara

కరోనా కాలంలో కిచెన్‌ని ఇలా శుభ్రం చేయాల్సిందే!

కరోనా కారణంగా ముట్టుకున్న ప్రతి వస్తువునూ శుభ్రం చేయడం ఇప్పుడు ఆడవాళ్లకు నిత్యకృత్యమైపోయింది. ఎంత తీరిక లేకపోయినా సరే.. తీరిక చేసుకొని, ఓపిక తెచ్చుకొని మరీ ఇంటిని క్రిమి రహితంగా మార్చేస్తున్నారు. అయితే మనం రోజులో ఎక్కువ సమయం గడిపే కిచెన్‌ సంగతేంటి? కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, స్టౌ, సింక్‌.. ఇలా మనం వంట చేసే క్రమంలో ఎంత తరచుగా వీటిని ఉపయోగిస్తామో.. అంతే శ్రద్ధగా వీటిని శుభ్రం చేయాలంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. అలాకాకుండా సమయం లేదని, ఓపిక అంతకన్నా లేదని ఏదో పైపైన శుభ్రం చేస్తే బ్యాక్టీరియా, వైరస్‌ వృద్ధి చెందే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే కిచెన్‌ ఎలా శుభ్రం చేయాలో వివరిస్తూ ముచ్చటగా మూడు చిట్కాలను ట్విట్టర్‌లో పంచుకుందీ సంస్థ. వీటితో పాటు కిచెన్‌ను శుభ్రం చేయడానికి పాటించాల్సిన మరికొన్ని చిట్కాలేంటో చూసేద్దాం!

Know More

women icon @teamvasundhara

జిమ్‌కు వెళుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే!

అన్‌లాక్‌లో భాగంగా ప్రభుత్వం దశలవారీగా కొన్ని సడలింపులిస్తోంది. ఈ క్రమంలో అన్‌లాక్‌ 3.0లో భాగంగా ఇచ్చిన సడలింపుల్లో జిమ్‌ సెంటర్లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, యోగా శిక్షణ కేంద్రాలు మళ్లీ తెరచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సెంటర్లలో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫిట్‌నెస్‌ ప్రియులు కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూనే నెమ్మదిగా వర్కవుట్‌ సెంటర్ల బాట పడుతున్నారు. మరి, ప్రస్తుతం కరోనా తన విశ్వరూపం చూపిస్తోన్న ప్రతికూల పరిస్థితుల్లో జిమ్‌ సెంటర్ల యజమానులు, జిమ్‌కు వెళ్లే ఫిట్‌నెస్ ప్రియులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

కరోనా అలర్ట్: పాల ప్యాకెట్లను ఎలా శానిటైజ్ చేయాలో తెలుసా?

ఇంటి పనులతో అలసిపోయినా, ఆఫీస్‌ పనులతో బిజీగా ఉన్నా సరే.. ఓపిక తెచ్చుకొని మరీ ఒకటికి రెండుసార్లు శుభ్రం చేస్తున్నాం. ఈ క్రమంలో నెలకు సరిపడా నిత్యావసరాలను మార్కెట్‌ నుంచి తీసుకొచ్చి ఒకేసారి శానిటైజ్‌ చేసి పెట్టుకుంటున్నాం.. అదే కాయగూరలైతే వారానికోసారి తెచ్చుకొని ఉప్పు నీళ్లు, పసుపు నీళ్లతో శుభ్రం చేస్తున్నాం. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ.. ఏ రోజుకారోజు తెచ్చుకునే పాల ప్యాకెట్స్‌ సంగతేంటి? ‘హా.. వాటిపై ఏముంటుందిలే..’ అంటూ చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. కానీ అలాంటి అలక్ష్యమే వద్దంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’. ఈ నేపథ్యంలోనే పాల ప్యాకెట్‌ కొనడం దగ్గర్నుంచి ప్యాకెట్‌లోని పాలను మరగబెట్టే దాకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సూచిస్తూ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో మనమూ తెలుసుకొని పాటించేద్దాం రండి..

Know More

women icon @teamvasundhara

ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు...ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

స్వాతి ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. బహుళ జాతి కంపెనీ కావడంతో ఆఫీసు మొత్తం ఏసీ సదుపాయం ఉంది. అలాగే తన ఇంటి బెడ్‌రూమ్‌లోనూ ఓ ఏసీని ఏర్పాటు చేసుకుంది స్వాతి. దీంతో ఆమెకు ఏసీ ఓ అవసరంలా మారిపోయింది. కాసేపు బయట కూర్చున్నా సరే ఉక్కపోత, చెమటలు పట్టేస్తున్నాయంటూ చిరాకు పడుతోంది. అయితే ప్రస్తుతం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోన్న స్వాతి ఏసీ కోసం తన బెడ్‌రూమ్‌లోనే ఆఫీస్‌ వాతావరణాన్ని సృష్టించుకుంది. అంతలోనే.. ‘కరోనా వైరస్‌ చల్లటి ప్రదేశాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఏసీ ఉపయోగించే ప్రదేశాల్లో వైరస్‌ విస్తరణ మరీ ఎక్కువగా ఉంది.. కాబట్టి ఏసీలను ఉపయోగించకండి..’ అంటూ వాట్సాప్‌లో వైరలవుతోన్న ఓ మెసేజ్‌ చదివింది. దీంతో ఏసీ వినియోగించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడింది స్వాతి. మరి, నిజంగానే ఏసీల వల్ల కరోనా వ్యాపిస్తుందా..? కరోనా విస్తృతిపై ఏసీల ప్రభావం ఎంత వరకు ఉంటుంది? ఒకవేళ ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏసీ వాడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏసీలు, కూలర్లు, వెంటిలేషన్‌ విషయాల్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలేంటి..? ఈ విషయాల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon @teamvasundhara

హోమ్‌ మేడ్ మాస్క్‌లను శుభ్రం చేసుకోండిలా!

లాక్‌డౌన్‌ కఠినంగా అమలుచేస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ర్ట, దిల్లీ, మధ్యప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక కరోనాను నియంత్రించేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయి. ముఖానికి మాస్క్‌ లేకుండా బయటకు వస్తే జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించాయి. దీంతో ప్రమాదకర వైరస్‌ నుంచి బయటపడేందుకు చాలామంది మాస్కులు ధరిస్తున్నారు. ఈక్రమంలో మాస్కుల వినియోగం, వాటి శుభ్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

Know More

women icon @teamvasundhara

ఈ చిట్కాలు పాటిద్దాం.. కరోనాకు దూరంగా ఉందాం..!

ప్రస్తుతం ఎవరిని కదిపినా కరోనా తప్ప మరే మాటా మాట్లాడట్లేదు. అంతలా మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోందీ మహమ్మారి. దీని నివారణకు మందు లేకపోవడంతో ఈ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అంటూ అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇటు వైద్యులు చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం.. వంటివి అత్యంత ఆవశ్యకం. వీటితో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా కీలకమే. ఎందుకంటే రోగనిరోధక శక్తి చురుగ్గా ఉన్న వారు కరోనా బారిన పడకుండా ఉండడంతో పాటు ఒకవేళ వారికి వ్యాధి సోకినా ప్రాణాపాయం నుంచి బయటపడచ్చనేది ఇప్పటికే చాలా కరోనా కేసుల్ని బట్టి మనకు తెలుస్తోంది. మరి, అలాంటి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన నియమాలకు సంబంధించి ఇటీవలే ‘ఆయుష్‌’ మంత్రిత్వ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్‌ని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. మరి, ఆ వివరాలేంటో తెలుసుకుందామా?

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala