అందుకే ఈ వయసులో పీజీ క్లాసులకు వెడుతున్నా!
ఏ పని చేయడానికైనా వయసుతో నిమిత్తం లేదని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహిళలు పిల్లలతో కలిసి పై చదువులు చదువుతున్నారు. మరికొందరు వృద్ధాప్యంలో తమ మనవళ్లు, మనవరాళ్లతో సరిసమానంగా డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది ఇంగ్లండ్‌కు చెందిన 52 ఏళ్ల మారిసా ఓహరా. పదిహేనేళ్ల క్రితం కొన్ని కారణాలతో అర్ధాంతరంగా చదువు ఆపేసిన ఆమె ప్రస్తుతం మళ్లీ పుస్తకాలు పట్టుకుని కళాశాలకు వెళుతోంది. ఐదుగురు పిల్లలకు తల్లై, అమ్మమ్మ కూడా అయిన వయసులో ఆమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఎంతో ఉత్సాహంతో పీజీ క్లాసులకు హాజరవుతోంది. అందులోనూ తనకన్నా వయసులో చిన్న అయిన స్టూడెంట్స్‌తో కలిసి హాస్టల్లో ఉండి మరీ చదువుకుంటోంది.
Know More