సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

గొడవ పడ్డాం.. ఎంత ట్రై చేసినా మాట్లాడడం లేదు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇప్పుడు సానుకూల దృక్పథమే మందు.. అందుకే ధైర్యంగా ఉందాం!

ఎవరిని కదిపినా కరోనా భయమే! ‘అమ్మో నాకెక్కడ ఈ మహమ్మారి అంటుకుంటుందో.. దానివల్ల నా కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తుందేమో!’ అని ఎవరికి వారు మానసికంగా కుంగిపోతున్నారు. నిజానికి ఇలాంటి సమయంలోనే ధైర్యం, సానుకూల దృక్పథం కావాలంటోంది టాలీవుడ్‌ అందాల తార అనుష్కా శెట్టి. ప్రస్తుత కష్టకాలంలో ఎవరికి వారుగా కాకుండా ఒకరికొకరు తోడుగా ఉండాలని, ఈ ఐకమత్యమే మనల్ని ఈ వైపరీత్యం నుంచి బయటపడేస్తుందని చెబుతోంది. కరోనా భయంతో కుంగిపోతూ మానసిక వేదనకు గురవుతోన్న తన ఫ్యాన్స్‌ కోసం తాజాగా ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది స్వీటీ.

Know More

women icon @teamvasundhara

గుండె రాయి చేసుకున్నా.. క్యాన్సర్‌ను జయించా!

క్యాన్సర్‌.. మందు లేని ఈ మహమ్మారి ఎన్నో ఏళ్లుగా మానవజాతిని పట్టి పీడిస్తోంది. ఆడ, మగ, చిన్నా, పెద్దా అన్న తేడాల్లేకుండా అందరినీ భయపెడుతోంది. అయితే దీనిపై ముందు నుంచీ అవగాహన పెంచుకోవడం, తొలిదశలోనే గుర్తించడం, క్యాన్సర్‌ అంటూ భయపడిపోకుండా సరైన చికిత్సలు తీసుకుని ధైర్యంగా ముందుకు సాగితే దీని నుంచి బయటపడవచ్చు. ఎందరో సెలబ్రిటీలు తమ అనుభవాల ద్వారా ఈ మాటలను అక్షర సత్యం చేశారు. అలాంటివారిలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనాలీ జగ్తాప్‌ ఒకరు. రెండేళ్ల క్రితం ప్రమాదకర గర్భాశయ క్యాన్సర్ బారిన పడిన ఆమె మానసిక స్థైర్యంతో ఆ మహమ్మారిని అధిగమించింది. చికిత్స సమయంలో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా తన క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన అనుభవాలు షేర్‌ చేసుకున్న ఆమె ఆ తర్వాత కూడా తనకు వీలైనప్పుడల్లా క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో ‘ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం’ సందర్భంగా క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకుంది మనాలీ.

Know More

women icon @teamvasundhara

కొడుకు బలైనా ఈ వందేళ్ల బామ్మ మాత్రం కరోనాను జయించింది!

ప్రపంచంపై కరోనా ప్రకోపం చల్లారడం లేదు. ఇప్పటికే లక్షలాది మందిని బలితీసుకున్న ఈ వైరస్‌ రోజురోజుకీ తన పరిధిని పెంచుకుంటోంది. ఇక రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో వృద్ధులే ఎక్కువగా ఈ మహమ్మారికి బలవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే మనదేశంతో పాటు చాలా దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులిచ్చినా వృద్ధులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదని మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కోగలమని ఇప్పటికే చాలామంది వయోవృద్ధులు నిరూపిస్తున్నారు. తద్వారా తమ లాంటి వారికి వూరటనిస్తూ బతుకుపై ఆశలు కల్పిస్తున్నారు. ఈకోవకే చెందుతుంది ఇండోర్‌కు చెందిన చందాబాయి. వయసులో సెంచరీ దాటిన ఈ బామ్మ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఇటీవలే ఇంటికి చేరుకుంది.

Know More

women icon @teamvasundhara

యోగా... ఆరోగ్యానికి మంచిదేగా!

నలుగురికీ ఉపయోగపడే ఏ మంచి విషయమైనా అందరితో షేర్‌ చేసుకునేందుకు ముందుంటుంది మెగా కోడలు ఉపాసన. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోని హెల్త్‌కేర్‌ విభాగం బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్న ఆమెకు ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలపై పూర్తి అవగాహన ఉంది. అందుకే ఈ అంశాలకు సంబంధించిన పోస్ట్‌లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అందరిలో అవగాహన కల్పిస్తోంది ఉప్పీ. ఇక ‘బీ పాజిటివ్‌’ పత్రికకు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఉపాసన, సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ వారి లైఫ్‌స్టైల్‌, ఆహారపు అలవాట్లను అందరికీ పరిచయం చేస్తోంది. ఇక యూట్యూబ్‌ ద్వారా కూడా ఆరోగ్య చిట్కాలు, ఫిట్‌నెస్‌, యోగా వంటి అంశాలపై అందరికీ అవగాహన కల్పిస్తోందీ సూపర్‌వుమన్‌. వీటితో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఆమె తాజాగా తెలంగాణ పోలీసులకు యోగా పాఠాలు నేర్పించారు.

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. నాకు పెళ్లై ఎనిమిది నెలలవుతోంది. నేను, మా ఆయన నెల రోజుల క్రితం గొడవపడ్డాం. మా ఇద్దరికీ ఏ గొడవ జరిగినా ఆయన వాళ్ల నాన్న దగ్గరికి తీసుకెళ్లి పంచాయతీ పెడతారు. ఈసారి కూడా అలాగే చేయడంతో నేను మా పుట్టింటికి వచ్చేశాను. నేను ఏం చెప్పినా ఆయన నాపై ఎప్పుడూ అరుస్తుంటాడు. వాళ్లింట్లో అందరూ కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి మాట్లాడుతుంటారు. ఆయన నన్ను సోషల్ మీడియా ఖాతాల్లో కూడా బ్లాక్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత మా నాన్న గారు మా మావయ్యగారికి ఫోన్‌ చేస్తే సాయంత్రం మాట్లాడదామని పెట్టేశారు. ఆ తర్వాత మాట్లాడలేదు. మా వారికి వేరే నంబర్‌ నుండి ఫోన్‌ చేస్తే దానిని కూడా బ్లాక్‌ చేశాడు. నెల రోజుల నుండి మా మధ్య ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ లేవు. మా ఆయన తరఫు వారు చాలా మొండిగా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. మా అమ్మానాన్న కోర్టు నోటీసులు పంపిద్దామని అంటున్నారు. నాకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కావడం లేదు. దయచేసి సలహా ఇవ్వగలరు - ఓ సోదరి

మీ సమస్యను బట్టి మీ ఇద్దరి మధ్య మానసికంగా అనుబంధం దృఢపడినట్లు అనిపించడం లేదు. మీరిద్దరూ ఒకరికొకరు అలవాటు పడే క్రమంలోనే తగాదాలు, గొడవలు వస్తున్నాయి. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఇరు కుటుంబ సభ్యులతో మీ విషయం గురించి చర్చించారా? అతను ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరకు తీసుకెళ్తుంటే అది మీకు నచ్చట్లేదన్న విషయాన్ని అతనికి అర్థమయ్యే విధంగా చెప్పారా? ఎనిమిది నెలల సాన్నిహిత్యంలో కేవలం పోట్లాడుకున్న సందర్భాలే ఉన్నాయా? ఆనందంగా గడిపిన క్షణాలు కూడా ఉన్నాయా? వంటి విషయాలన్నింటినీ మీరు ఓసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.

పెళ్లి చేసుకునే విషయంలో ఎలాగైతే తొందరపాటు పనికిరాదో.. విడిపోయే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
ఈ క్రమంలో- మీ నాన్న గారు ఫోన్ చేస్తే మీ మామగారు తర్వాత మాట్లాడదామన్నారని చెప్పారు. మీ భర్త కూడా మీతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్లతో మాట్లాడడానికి మళ్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికీ స్పందన లేకపోతే మీ కుటుంబంలోని ఇతర పెద్దలతో కలిసి డైరెక్ట్ గా వాళ్ళింటికే వెళ్లి మాట్లాడి చూడండి. ఇందుకోసం మీ రెండు కుటుంబాల్లోనూ మీ సంక్షేమం కోరే మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోవచ్చు.
ఈ విధంగా - మీ ఇరుపక్షాల పెద్దవాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుని మీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే పరిస్థితులను కల్పించగలుగుతారేమో చూడండి. అయితే అది ఎంతవరకు సఫలమవుతుందనేది రెండువైపుల నుంచి లభించే సహకారం పైనే ఆధారపడి ఉంటుంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే - ఇతర మార్గాల ద్వారా ప్రయత్నించాల్సి వస్తుందేమో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు.
0 Likes
Know More

Movie Masala