డిప్రెషన్ మమ్మల్ని కూడా కుంగదీసింది... కానీ కసితో పోరాడాం!
మానసిక ఆందోళన... ప్రపంచంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, పలు ఆరోగ్య, వ్యక్తిగత, ఆర్థిక పరమైన సమస్యలు, పని ఒత్తిడి.. వంటి ఎన్నో కారణాలు ఈ సమస్య తలెత్తడానికి దోహదం చేస్తున్నాయి. మనిషిని శారీరకంగా, మానసికంగా ఎంతో కుంగదీసే ఈ ఆరోగ్య సమస్యను మొదట్లోనే అడ్డుకోవాలి. లేకపోతే ఒకానొక సమయంలో వీటిని భరించలేక చాలామందికి చనిపోవాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. అందుకు తాజా నిదర్శనమే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం. బాలీవుడ్‌తో పాటు సినిమా పరిశ్రమను కుదిపేసిన అతడి మరణం అందరికీ షాక్ ఇచ్చింది. ఈనేపథ్యంలో మానసిక ఒత్తిడి కారణంగా గతంలో తమ మదిలోనూ ఇలాంటి ఆలోచనలు మెదిలాయంటున్నారు ప్రముఖ తారలు ఖుష్బూ, షమితా శెట్టి. ఈ సందర్భంగా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా డిప్రెషన్‌కు సంబంధించిన తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.
Know More