అందుకే నిండు గర్భంతో 1.6 కిలోమీటర్లు పరిగెత్తింది!
గర్భం ధరించిన మరుక్షణం నుంచి మహిళలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మనకు తెలిసిందే. బరువులెత్తకూడదని, కఠినమైన పనులు చేయకూడదని, ఇంకొందరైతే కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.. ఇలా గర్భస్థ సమయంలో చాలామంది మహిళలు అపురూపంగా మారిపోతుంటారు. కానీ ప్రెగ్నెన్సీ అనేది అనారోగ్యం కాదని, అది శరీరానికి అయిన గాయం అంతకన్నా కాదని అంటోంది అమెరికాకు చెందిన మాకెనా మైలర్ అనే మహిళ. గర్భం ధరించడమనేది మహిళలకు మాత్రమే దక్కిన ఓ గొప్ప వరమని, అదో అందమైన అనుభవమని.. ఆ సమయంలోనూ మహిళలు తమను తాము నిరూపించుకోగలరని కాబోయే తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది. మాట వరుసకే కాదు.. ప్రస్తుతం తొమ్మిది నెలల నిండు గర్భిణి అయిన ఆమె.. కేవలం ఐదు నిమిషాల్లోనే 1.6 కిలోమీటర్లు పరిగెత్తి ఈ విషయాన్ని స్వయంగా నిరూపించింది కూడా! మరి, తొమ్మిది నెలల గర్భంతో నడవడానికే ఆయాసమొస్తుంటుంది.. అలాంటిది పరిగెత్తడమేంటి? అసలు ఆమెకు ఇది ఎలా సాధ్యమైంది? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
Know More