ఈ బ్యూటిఫుల్ జర్నీలో మీరే వారికి తోడుగా నిలవాలి!
అమ్మతనం.. ఆడజన్మకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. అందుకే పెళ్లైన ప్రతి మహిళా తాను అమ్మగా ఎప్పుడెప్పుడు ప్రమోషన్ పొందుతానా అని ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. ఇక అలాంటి అమ్మతనాన్ని పరిపూర్ణం చేసే ప్రక్రియ బ్రెస్ట్ఫీడింగ్ . తల్లి తన బిడ్డకు ఎంత ఎక్కువ కాలం పాటు పాలిస్తే అంత మంచిది. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కొత్తగా తల్లైన మహిళలు అటు తన పాపాయి సంరక్షణ చూసుకుంటూ, ఇటు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు.. మరోవైపు ఇంటి పనుల్నీ సమన్వయం చేసుకుంటారు. ఈ క్రమంలో వారిపై చాలా ఒత్తిడి పడుతుంది. కానీ బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవం’ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది బాలీవుడ్ అందాల తార సమీరా రెడ్డి. కొత్తగా అమ్మతనంలోకి అడుగుపెట్టిన మహిళలకు అటు భర్త, ఇటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అండదండలు చాలా ముఖ్యమని, తద్వారా అమ్మలు ఎలాంటి ఆందోళన చెందకుండా పిల్లలకు పాలివ్వడం, అన్ని పనుల్ని సమన్వయం చేసుకోవడం వీలవుతుందని చెబుతూ తాజాగా ఇన్స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టిందీ బ్యూటిఫుల్ మామ్.
Know More