ఛాయ నలుపైనా అసలైన అందం మాదే.. అంటున్నారు!
అందమంటే.. తెల్లగానే ఉండాలని ఎవరన్నారు? తీరైన ముఖాకృతి, కళ ఉట్టిపడే మోము, కలువల్లాంటి కళ్లు, తీర్చిదిద్దినట్లుండే ముక్కు, దొండపండు లాంటి అధరాలు.. ఉన్న వారే అసలైన అందగత్తెలని అంటున్నారు టాంజానియా మగువలు. అందానికి అసలు సిసలైన నిర్వచనమిచ్చే ఈ ప్రమాణాలన్నీ తమలో ఉన్నాయని అంటున్నారీ సుందరాంగిణులు. వారి ఛాయ నలుపే అయినా.. అపురూప సౌందర్యం వారి సొంతం. అందుకే అందరిచేతా ‘డస్కీ బ్యూటీస్’గా ప్రశంసలందుకుంటున్నారు. మరి, ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోన్న వారి అందం వెనకున్న రహస్యమేంటో తెలుసా! ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన వరాలే! అవేంటో తెలుసుకోవాలని మీకూ ఆతృతగా ఉంది కదూ!! అయితే ఆలస్యమెందుకు... అసలు విషయంలోకి వెళ్దాం పదండి.
Know More