అందుకే ఆ బుల్లి ఏనుగుకు ఆమె పేరు పెట్టారు!
సుధామూర్తి... సామాజిక సేవకు పర్యాయ పదంగా నిలిచి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్‌గా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా సాదాసీదాగా ఉండడానికే ఇష్టపడే ఆమె వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శమని చెప్పవచ్చు. ఓవైపు ఫౌండేషన్ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మిసెస్ మూర్తి. తన సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మశ్రీతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆమె తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా సుధామూర్తి అందించిన సేవలకు కృతజ్ఞతగా బెంగళూరులోని ఓ ఉద్యానవనంలో పుట్టిన ఓ బుల్లి ఏనుగుకు ‘సుధ’ అని నామకరణం చేశారు.
Know More