సింగిల్‌గా ఉండడం తప్పు కాదు.. అందమంటే కొలతలు కాదు!
పెళ్లి చేసుకోకపోతే సింగిల్‌గా ఎందుకున్నావంటారు. పెళ్లైంది మొదలు పిల్లల్ని ఎప్పుడు కంటావ్ అని అడుగుతుంటారు. అందంగా లేకపోతే గ్రహాంతర వాసిలా చూస్తుంటారు. పురుషులతో సమానంగా పనిచేసినా సమాన వేతనం మాత్రం ఇవ్వరు. ఎన్ని తరాలు మారినా ఈ సమాజం ఆడవారిని చూసే ధోరణిలో మాత్రం మార్పు రావట్లేదు. పురుషుల్లాగే స్త్రీలూ ఈ సమాజంలో భాగమైనా ఇద్దరినీ వేర్వేరుగా చూడడం, అన్ని విషయాల్లో ఆడవారినే తప్పుబట్టడం మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు.. అయినా భూదేవికి ఉన్నంత ఓర్పుతో అన్నీ భరిస్తూ, ప్రతికూలతల్ని కూడా సానుకూలంగా స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎంతోమంది అతివలు. కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలూ ఇందుకు అతీతులు కాదు. వెండితెర రంగుల ప్రపంచంలో తమకెదురైన ఆటుపోట్లను అధిగమిస్తూ, తోటి మహిళల సమస్యల్ని తమ గళంలో వినిపిస్తూ ఎంతోమందిలో పాజిటివిటీని నింపుతున్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా పలువురు నటీమణులు వివిధ సందర్భాల్లో పంచుకున్న అలాంటి స్ఫూర్తిదాయక సందేశాలు వారి మాటల్లోనే మీకోసం..!
Know More