శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడమే ముఖ్యం.. మిగతాదంతా బోనసే!
దిశా పటానీ... బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ‘లోఫర్’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘ఎం.ఎస్. ధోనీ’, ‘కుంగ్ ఫూ యోగా’, ‘వెల్కమ్ టు న్యూయార్క్’, ‘బాఘీ2’, ‘భారత్’, ‘మలంగ్’, ‘బాఘీ3’ సినిమాలతో బాలీవుడ్లో గ్లామరస్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకుంది. ఇక హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపే ముద్దుగుమ్మల్లో ఈమె కూడా ఒకరు. కఠినమైన వర్కవుట్లను సైతం అలవోకగా చేయడం, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈ చక్కనమ్మకు వెన్నతో పెట్టిన విద్య. దీంతో పాటు తన గ్లామరస్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు, హెల్దీ డైట్‌కు సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుందీ బాలీవుడ్ బేబ్. ఇలా సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న దిశ తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘Ask me anything’ పేరుతో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చింది. మరి దిశాకు, అభిమానులకు మధ్య జరిగిన ఆ సంభాషణ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More