ఆ ప్రేమకథే ఈ అవార్డు తెచ్చిపెట్టింది!
కొన్ని చోట్ల బాల్య వివాహాలు, మరికొన్ని చోట్ల నెలసరి సమయంలో ఇంట్లోకి రావద్దంటూ ఆంక్షలు, ఇంకొన్ని చోట్ల కులాంతర, మతాంతర ప్రేమ వివాహాలను నేరంగా పరిగణించడం.. ఇలా మన దేశంలో ఎన్నో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన పాతకాలపు సంప్రదాయాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సామాజిక సమస్యలను వెండితెరపై ఆవిష్కరించే వారు కొందరైతే, మరికొందరు తమ కలంతోనే ఈ సామాజిక అంశాలను నలుగురిలోకీ తీసుకెళ్తారు.. అందరి మెప్పూ పొందుతారు. అలాంటి ఓ సున్నితమైన సామాజిక అంశాన్నే అందమైన ప్రేమకథగా మలచిందో భారతీయ యువ రచయిత్రి. దానికి ప్రతిగా ప్రతిష్ఠాత్మక ‘కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్’ అందుకుంది. మరి, ఇంతకీ ఎవరామె? ఆమె రాసిన కథేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
Know More