సునీత ప్రి వెడ్డింగ్ పార్టీలో సెలబ్రిటీల సందడి!
తన మధురమైన గాత్రంతో తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న సునీత కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యతలు చూసుకుంటోన్న ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో దండలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకుందీ జంట. ఈ క్రమంలో వివాహ సమయం దగ్గరపడుతుండడంతో స్నేహితులు, సన్నిహితుల కోసం వరసగా ప్రి వెడ్డింగ్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు సునీత-రామ్. కొద్ది రోజుల క్రితం ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో టాలీవుడ్ నటీనటులు, సింగర్స్‌కు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన వీరు తాజాగా మరోసారి పార్టీని ఏర్పాటు చేశారు. గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
Know More