వీటి విషయంలో సౌకర్యమే ప్రధానం!
చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. అందుకే అతివల వార్డ్‌రోబ్‌లో వీటికి ప్రత్యేకమైన షెల్ఫ్ కూడా ఉంటుంది. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్, బ్రాలెట్, స్పోర్ట్స్ బ్రా.. వంటివి ఎంచుకొని కూల్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించేస్తుంటారు అమ్మాయిలు. అయితే వీటిని ఇష్టపడి ధరించే వారి కంటే.. ‘తప్పదు.. వేసుకోవాల్సిందే..’ అంటూ అయిష్టంగా ధరించే వారే ఎక్కువమంది ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్లా ఏర్పడడం.. వంటి స్వీయానుభవాలే వారి ఫీలింగ్‌కి ప్రధాన కారణం. మరి, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రా ధరించాల్సిందేనా? ఇది వేసుకోకపోతే నష్టమేంటి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మరీ అసౌకర్యంగా అనిపిస్తే బ్రా ధరించకపోయినా ఎలాంటి నష్టం ఉండదంటున్నారు సంబంధిత నిపుణులు. ఇంకా చెప్పాలంటే అత్యవసరం కానప్పుడు బ్రా వేసుకోకపోతే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు వారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..
Know More