౩౦ రోజుల్లో మానసిక ఆరోగ్యం.. నమ్రత పాజిటివ్ ప్లాన్ చూశారా?
జీవన విధానంలో చోటు చేసుకునే పలు మార్పుల వల్ల ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఒత్తిడి, ఆందోళనలకు గురవుతూ తమలో తామే కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏటా ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం’ (అక్టోబర్ 10) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమస్యలపై మరింత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో మానసిక అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు తానెలాంటి పనులు చేస్తున్నానో సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది ప్రిన్స్ మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్.
Know More