ఈ లాక్డౌన్లోనే పిల్లలను ‘హెల్దీ’గా మార్చేద్దాం!
మనం తీసుకునే ఆహారం అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల విషయంలో ఆరోగ్యకరమైన ఆహార నాణ్యతా ప్రమాణాలను పాటించలేకపోతున్నారు. ఎందుకంటే తమకు పెట్టే ఆహారం రుచించక ఎక్కువశాతం మంది పిల్లలు భోజనం చేసే విషయంలో తల్లుల్ని తెగ విసిగిస్తుంటారు. వాళ్లకు ఇష్టమైనవైతేనే నోరు తెరుస్తారు.. లేదంటే మూతి తిప్పేస్తుంటారు. ఇక జంక్ ఫుడ్ అంటే లొట్టలేసుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తారు. అయితే తమ చిన్నారుల దృష్టిని వీటిపై నుంచి మరల్చడంలో తల్లిదండ్రులు విఫలమవుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే బయటికి వెళ్లిన ప్రతిసారీ చిప్స్, బిస్కట్స్, పిజ్జా, బర్గర్ అంటూ వారికి అలవాటు చేయడంతో ఇంటి ఆహారం వారికి నచ్చట్లేదు. కాబట్టి ఈ అలవాటు మాన్పించాలంటే.. పిల్లల కంటికి నచ్చేలా కాదు.. నోటికి రుచించేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వడం తల్లుల బాధ్యత. మొన్నటిదాకా అంటే బిజీబిజీ పనుల వల్ల అది కుదరకపోవచ్చు.. కానీ ఈ లాక్డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని అందుకు వినియోగించండి.. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవర్చండి. అందుకు తల్లులు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
Know More