మిమ్మల్ని ఇష్టపడే వాళ్లనే.. మీరూ ఇష్టపడండి!
తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది అందాల తార రాయ్ లక్ష్మీ. ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. అనంతరం పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు బాలీవుడ్‌లోనూ నటించిన ఈ బ్యూటీ.. సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లోనే ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకోవడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. మే 5న లక్ష్మీ రాయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తను పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు, వాటికి ఇచ్చిన ఆసక్తికరమైన క్యాప్షన్లపై ఓ లుక్కేద్దాం రండి..
Know More