సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

psychologist Ask Psychologist
ఓ సోదరి.

ఎప్పుడూ యూట్యూబ్ వీడియోలే... ఎలా మార్చాలి?

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

Movie Masala

Video Gallery

 
women icon @teamvasundhara

ఇదిగో.. మా లిటిల్‌ లడ్డూ!!

అమ్మతనమే మహిళల జీవితానికి పరిపూర్ణతను తీసుకొస్తుంది. అందుకే తాను తల్లవుతున్నానని తెలిసిన మరుక్షణం నుంచే ఎప్పుడెప్పుడు తన బిడ్డను చేతుల్లోకి తీసుకుంటానా అని ఎదురుచూస్తుంటుంది. ఇక ఆ క్షణం రాగానే తన చిన్నారిని చూసి ఈ లోకాన్నే మర్చిపోతుంది. పాపాయి ఆలనా పాలనలోనే నిరంతరం గడుపుతూ.. తన ముద్దుల మూటను అందరికీ ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అన్న సంతోషంలో మునిగితేలుతుంటుంది. బాపూ బొమ్మ స్నేహ కూడా ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగిపోయింది. ఈ ఏడాది జనవరిలో తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఈ అందాల అమ్మ.. తన చిన్నారి ఫొటోను తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయింది. తమ లిటిల్‌ ఏంజెల్‌ని అందరికీ పరిచయం చేయడానికి తన భర్త పుట్టినరోజును మించిన మంచి సందర్భం దొరకలేదంటూ ఓ అందమైన నోట్‌ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Know More

women icon @teamvasundhara

ఆ క్షణం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది..!

‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల..’ ‘ఫిదా’ సినిమాలోని ఈ డైలాగ్తో కుర్రకారు మనసుల్ని దోచేసింది అందాల తార సాయిపల్లవి. మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రంలో ‘మలర్’ పాత్రలో నటించి సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపుకి తిప్పుకుంది. అనతి కాలంలోనే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ బ్యూటీ. పాత్ర ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ.. కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తోందీ మలయాళీ ముద్దుగుమ్మ. ఐదేళ్ల సినీ కెరీర్లో పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ రౌడీ బేబీ.. మే 9 సాయిపల్లవి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఈ క్యూట్‌ బ్యూటీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు, వాటికి తానిచ్చిన క్యాప్షన్లపై ఓ లుక్కేద్దామా..?

Know More

women icon @teamvasundhara

నేను ఎంచుకున్న.. నన్ను ఎంచుకున్న జీవితానికి థ్యాంక్స్‌!

ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి.. పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటి సమంత. గ్లామర్‌, లేడీ ఓరియంటెడ్‌, హోమ్లీ, థ్రిల్లర్‌, ప్రయోగాత్మక, సందేశాత్మక, సెంటిమెంట్‌.. ఇలా ఏ జోనర్‌కు చెందిన పాత్రైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడం సామ్‌కు వెన్నతో పెట్టిన విద్య. ట్యాలెంట్‌, శ్రమించేతత్వం, సరైన కెరీర్‌ ప్లానింగ్‌ ఉంటే హీరోయిన్లు వివాహం తర్వాత కూడా తమ ఫామ్‌ను కొనసాగించొచ్చని చెప్పడానికి సమంతే ఓ ఉదాహరణ. అయితే కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్‌లో ఉండడం సామ్‌ ప్రత్యేకత. ఏప్రిల్‌ 28 సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా తను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్టులు మీకోసం..!

Know More

women icon @teamvasundhara

నా హృదయం బరువెక్కినా నేను హ్యాపీగానే ఉంటా..!

‘అతిలోక సుందరి’ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లి అందంతో పాటు, నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుందీ చిన్నది. తండ్రి ఓ పెద్ద నిర్మాత అయినా, సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. ఇసుమంతైనా గర్వం లేకుండా సింపుల్‌గా ఉండడం జాన్వీ నైజం. నటనకు ప్రాధాన్యమున్న ‘ధడక్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైన జాన్వీ.. తొలి సినిమాలోనే తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాల్లోకి రాక ముందు క్యాలిఫోర్నియాలో ‘లీ స్ట్రాస్‌బర్గ్‌ థియేటర్‌ అండ్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌’లో యాక్టింగ్‌ కోర్సు చేసింది జూనియర్‌ శ్రీదేవి. ఇక ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ సిరీస్‌తో ప్రేక్షకులను భయపెట్టిన ఈ చేప కళ్ల చిన్నది.. ప్రస్తుతం గుంజన్‌ సక్సేనాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఇలా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీ. ఈ క్రమంలోనే తన లేటెస్ట్‌ ఫొటోలతో పాటు కుటుంబంతో గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకోవడం ఈ చక్కనమ్మకు అలవాటే. ఈ అందాల రాశికి నేటితో (శుక్రవారం మార్చి 6) 23 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్ట్‌లపై ఓ లుక్కేద్దామా..?

Know More

women icon @teamvasundhara

హ్యాపీ బర్త్‌డే ‘కత్తి కాంతమ్మ’..!

‘ఈ సినిమాలో నాకు దొరికిన మంచి నటి హరితేజ. ఈ అమ్మాయిని చాలా సంవత్సరాలపాటు చూడాలి. నచ్చినా, నచ్చకపోయినా భరించడమే.. తప్పదు. ఎందుకంటే ఈ అమ్మాయి నాకు చిన్న వయసులో ఉన్న అందమైన సూర్యకాంతంలా అనిపించింది. అంతటి గొప్ప నటిలా అనిపించింది హరితేజ.’ ఇవీ... ‘అ..ఆ’ సినిమా ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్‌ చెప్పిన మాటలు. హరితేజ నటన చూస్తుంటే ఈ మాటలు అక్షరాలా నిజమే అనిపిస్తాయి. ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘మనసు మమత’ ధారావాహికతో మొదలైన హరితేజ ఆన్‌స్క్రీన్‌ జర్నీ.. సినిమాల వరకు విజయవంతంగా కొనసాగింది.. కొనసాగుతోంది. 2017లో తెలుగులో తొలిసారి ప్రసారమైన ‘బిగ్‌బాస్‌’ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరైందీ కుందనపుబొమ్మ. ఈ క్రమంలో తన హరికథా నైపుణ్యంతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుందీ చిన్నది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు పలు ప్రోగ్రామ్‌లకు యాంకర్‌గానూ వ్యవహరిస్తోంది హరితేజ. ఈ క్రమంలో ప్రస్తుతం ‘పండు చేస్కో’తో ఆడ పడుచులతో సందడి చేస్తోన్న హరి.. తాను ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్‌మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుందీ బ్యూటీ క్వీన్‌. ఈ క్రమంలో తన కెరీర్‌, వ్యక్తిగత విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంది. తన సహజ నటన, ఆకట్టుకునే రూపంతో బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులను సైతం అలరిస్తోన్న హరితేజ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 26 బుధవారం). ఈ సందర్భంగా హరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఆసక్తికర పోస్ట్‌లపై ఓ లుక్కేద్దామా.!!

Know More

women icon @teamvasundhara

ఇన్‌స్టాపురములో.. స్పందన !

తల్లి సారికలోని అందాన్ని, తండ్రి కమల్‌ హాసన్‌లోని ప్రతిభను పునికిపుచ్చుకుంది నటి శృతి హాసన్‌. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ బహుముఖ ప్రతిభా పాటవాలతో తనకంటూ ఓ ప్రత్యే గుర్తింపును సంపాదించుందీ అందాల తార. కమల్‌ హాసన్‌ నటించిన ‘హేరామ్‌’ చిత్రంలో అతిథి పాత్రతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి, 2009లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘లక్‌’ ద్వారా హీరోయిన్‌గా ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక 2011లో సిద్ధార్థ్‌ హీరోగా ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శృతి దేశవ్యాప్తంగా విశేష అభిమానులను సంపాదించుకుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా సింగర్‌గా మంచి పేరు సంపాదించుకుందీ ముద్దుగుమ్మ. ఆరేళ్ల వయసులోనే ఏకంగా సినిమాలో పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందీ లవ్లీ గర్ల్‌. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న ‘లాభం’ అనే తమిళ చిత్రంలో నటిస్తోందీ బ్యూటీ. ఇక సినిమాలు, మ్యూజిక్‌ షోలతో బిజీగా ఉండే శృతి సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. తన సినిమాలు, మ్యూజిక్‌ షోలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటుందీ ముద్దుగుమ్మ. జనవరి 28 శృతి హాసన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఆసక్తికరమైన పోస్టులు, వాటికి తానిచ్చిన క్యాప్షన్లపై ఓ లుక్కేద్దామా..!

Know More

psychologist Ask Psychologist
‹ ²òŸ¿J.

నమస్తే మేడమ్‌.. మా బాబు వయసు 11 సంవత్సరాలు.. వాడు యూట్యూబ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. రోజుకి 5 నుంచి 6 గంటలు యూట్యూబ్‌లో గేమ్స్‌కి సంబంధించిన వీడియోలు, ఫన్నీ వీడియోలు చూస్తుంటాడు. ఆన్‌లైన్ క్లాసులు, ఉపయోగపడేవి చూడమని ఎన్ని సార్లు చెప్పినా అస్సలు వినడు. ఒక్కోసారి చిరాకు వచ్చేంత వరకు ఫోన్‌ చూస్తుంటాడు. ఎంత సున్నితంగా, అర్థమయ్యేలా చెప్పినా యూట్యూబ్‌ చూడడం మాత్రం మానడం లేదు. బయటికి వెళ్లినప్పుడు స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు. కానీ, ఇంటికి రాగానే ఫోన్ పని మీదనే ఉంటాడు. దీనివల్ల చదువులో వెనకపడతాడేమో.. వాడిలో సహనం తగ్గిపోతుందేమో అని భయంగా ఉంది. ఏదైనా సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

వాస్తవ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లే ఈ అంతర్జాలాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించడానికే ప్రయత్నించాలి. ఎక్కువ సమయం యూట్యూబ్‌లో గడపడం అనేది నియంత్రించాల్సిన విషయమే. దీనిని ప్రారంభ దశలోనే నియంత్రించలేకపోతే ఒక అలవాటుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.
మీ అబ్బాయికి ఇతర ఆసక్తికరమైన ఆంశాలు ఏవైనా ఉన్నాయేమో ఆలోచించండి. దానివల్ల అంతర్జాలం నుంచి దృష్టిని మరల్చే అవకాశం ఉంటుంది. అతను స్నేహితులతో బాగానే ఆడుకుంటాడు అని చెప్పారు. కాబట్టి స్నేహితులు, తోబుట్టువులతో ఎక్కువ సేపు ఆడుకునేలా చేయండి. అలాగే అతని ఆలోచనలు సానుకూల మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు అతనితో అనునయంగా మాట్లాడాలి తప్పితే, కఠినంగా వ్యవహరించకూడదు. అలాగే అతని నుంచి బలవంతంగా ఫోన్‌ లాక్కోవడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయకండి. దీనివల్ల అతనిలో మొండితనం పెరిగే అవకాశం ఉంటుంది.

ఏదైనా సరే- ఒకే పనిని ఎక్కువసేపు చేస్తే సమయం వృధా అవుతుంది.. కాబట్టి అతనికి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ గురించి తెలియజేయండి. ఉదాహరణకు హోమ్‌ వర్క్‌కి ఇంత సమయం, అంతర్జాలానికి ఇంత సమయం, ఆటలకు ఇంత సమయం, కుటుంబంతో గడపడానికి ఇంత సమయం.. అంటూ కేటాయించండి. అలాగే మీరు కూడాటీవీ, ఫోన్ లతో అధిక సమయం గడపకుండా అతనికి సహకరించండి. ఇలాంటి విషయాల్లో మీరు అతనికి ఒక ఉదాహరణగా నిలబడగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే ఒక్క విషయం.. రాత్రికి రాత్రి ఒక్కసారిగా అతనిలో మార్పు రావాలని ఆశించకండి.. క్రమేపీ మార్పు రావడానికి దశలవారీగా ప్రయత్నం చేయండి. అలాగే విషయ పరిజ్ఞానం ఉన్న స్నేహితులతో అతనికి సాన్నిహిత్యం పెరిగే విధంగా చూసుకోండి. అలాంటప్పుడు వాస్తవం నుంచి తప్పించుకోకుండా ధైర్యంగా ఎలా ఉండాలో అతనికి అర్ధమవుతుంది.
0 Likes
Know More

Movie Masala