తిన్నామా.. పడుకున్నామా.. నెట్‌ఫ్లిక్స్ చూశామా..!
పాయల్ రాజ్‌పుత్. సినిమాల్లో తన అందంతో అభిమానులను కట్టిపడేసే ఈ అందాల తార ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉంది. గృహ నిర్బంధంలో ఉన్న సమయంలో తాను ఏం చేస్తుందో అభిమానులతో పంచుకుందీ లవ్లీ గర్ల్. టీవీ చూస్తూ, ఏదో తింటూ, నిద్రపోతూ, మొబైల్ ఫోన్ ఆపరేట్ చేస్తూ.. ఇలా రకరకాల ఫొటోలను ఒకచోట చేర్చిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘తినడం.. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడడం.. పడుకోవడం.. మళ్లీ వీటినే రిపీట్ చేయడం’ అని అర్థం వచ్చేలా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ అమ్మడు.
Know More