నా లిటిల్ ఏంజెల్ ఇదిగో!
‘హాయ్ రే హాయ్...జాంపండు రోయ్’ అంటూ ‘సింధూరం’ సినిమాలో రవితేజతో పాటు కుర్రకారును కూడా తన వెంట తిప్పుకుంది సంఘవి. ఈ సినిమాతో పాటు తెలుగులో ‘సీతారామరాజు’, ‘సమరసింహారెడ్డి’, ‘ఆహా’, ‘సూర్యవంశం’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘చిరంజీవులు’, ‘సందడే సందడి’ తదితర చిత్రాల్లో సందడి చేసిందీ ముద్దుగుమ్మ. తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లోని అగ్రహీరోలందరితోనూ స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ సొగసరి తన అందం, అభినయంతో హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈక్రమంలో నాలుగేళ్ల క్రితం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంఘవి 42ఏళ్ల వయసులో ఇటీవల అమ్మగా ప్రమోషన్ పొందింది. ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె సోషల్ మీడియా వేదికగా తన కూతురిని పరిచయం చేసింది.
Know More