శాంతమ్మా.. ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటారు!
‘వైద్యో నారాయణో హరి’ అంటూ వైద్యులను సాక్షాత్తూ నారాయణుడి (భగవంతుడు)తో పోల్చారు మన పెద్దలు. తాము నేర్చుకున్న విద్యతో తరతమ భేదం లేకుండా సహాయం చేయమనే ‘వైద్య వృత్తి’ నిజంగానే ఎంతో పవిత్రమైనది. అలాంటి వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి, దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు డాక్టర్ విశ్వనాథన్ శాంత. తన జీవితంలో ఏనాడూ వైద్యాన్ని వృత్తిగా, వ్యాపారంగా చూడని ఆమె... పేదలు, అణగారిన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేశారు. మందు లేని మహమ్మారి క్యాన్సర్‌పై అసమాన పోరాటం చేస్తూ లక్షలాది మంది క్యాన్సర్ పీడితులకు ప్రాణం పోశారు. తన జీవితంలో సుదీర్ఘకాలం పాటు రోగులకు సేవ చేసి వైద్య వృత్తికే వన్నె తెచ్చిన శాంత (93) జనవరి 19న తుదిశ్వాస విడిచారు. ఛాతీ నొప్పితో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలో వైద్య రంగానికి ఆమె అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు నివాళి అర్పిస్తున్నారు.
Know More